ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఒక కస్టమర్ అమెజాన్ నుండి ఆన్‌లైన్‌లో Vivo Y20A మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయగా ఫోన్ కి బదులు మూడు సబ్బులు వచ్చాయి.
ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌లో వచ్చేస్తుంది. ఏది కావాలన్న నిమిషాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సేల్స్ పెరుగుతున్న కొద్దీ వాటి మోసాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కూడా ఒకటి ఆర్డర్ చేస్తే మరొక వస్తువులు రావడం చూసాం.. తాజగా ఇలాంటి సిన్ ఒకటి రిపీట్ అయ్యింది.
ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఒక కస్టమర్ అమెజాన్ నుండి ఆన్‌లైన్‌లో Vivo Y20A మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయగా ఫోన్ కి బదులు మూడు సబ్బులు వచ్చాయి.
undefined
కస్టమర్ ప్యాకేజీని అన్‌బాక్సింగ్ చేసిన తర్వాత ఆ సబ్బులను చూసి ఆశ్చర్యపోయాడు. నివేదిక ప్రకారం, Amazon కస్టమర్ కేర్ నుండి సహాయం కోరేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి, దింతో పరిస్థితిని మరింత క్లిష్టతరమైంది. అయితే కస్టమర్ ఈ సమస్యను X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసారు, సహాయం కోసం అమెజాన్‌పై "ఒత్తిడి తెచ్చేందుకు" నెటిజన్ల నుండి సహాయం కోరారు.
అతను చేసిన ట్విట్టర్ పోస్టులో తాను అమెజాన్లో ఫోన్ ఆర్డర్ చేసానని, ఫోన్ కి బదులు సబ్బు ముక్కలు వచ్చాయని, దీనిపై అమెజాన్ హెల్ప్ నుండి తనకి ఎలాంటి సహాయం లభించలేదని.. ఆన్ లైన్ మార్కెటింగ్లో ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసారు.
मेरी भांजी ने से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। कोई मदद भी नहीं कर रहा है।
सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB