ఇప్పుడు మరింత ఫన్నీగా వాట్సాప్‌ చాటింగ్.. మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు..

By Ashok kumar Sandra  |  First Published Jan 11, 2024, 7:50 PM IST

WaBetaInfo నివేదిక ప్రకారం, కొత్త అప్‌డేట్ తర్వాత స్టిక్కర్‌ల కోసం థర్డ్ పార్టీ యాప్ ఇక అవసరం లేదు. WhatsApp iOS బీటా వెర్షన్ 24.1.10.72లో కొత్త ఫీచర్ పరీక్షించబడుతోంది.
 


మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఒక గొప్ప ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, యూజర్లు స్వయంగా స్టిక్కర్‌లను రూపొందించవచ్చు. ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత యూజర్లు వాట్సాప్ యాప్‌లో స్టిక్కర్‌లను ఎడిట్ చేసి డిజైన్ చేసుకోవచ్చని నివేదికలో చెప్పబడింది.

WaBetaInfo నివేదిక ప్రకారం, కొత్త అప్‌డేట్ తర్వాత స్టిక్కర్‌ల కోసం థర్డ్ పార్టీ యాప్ ఇక అవసరం లేదు. WhatsApp iOS బీటా వెర్షన్ 24.1.10.72లో కొత్త ఫీచర్ పరీక్షించబడుతోంది.

Latest Videos

WhatsApp కస్టమ్ స్టిక్కర్ ఫీచర్ ఏమిటి?
వాట్సాప్‌లో చాలా కాలంగా స్టిక్కర్ల సపోర్ట్ ఉంది. స్టిక్కర్ల సహాయంతో వినియోగదారులు చాటింగ్‌ను మరింత మెరుగుపర్చ వచ్చు, కానీ ఇప్పటి వరకు  స్టిక్కర్ల కోసం థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడవలసి ఉండేది. కొత్త అప్ డేట్ తర్వాత ఇక ఆలా ఉండదు. యూజర్లు వారి సెలక్షన్ కి అనుగుణంగా స్టిక్కర్‌లను రూపొందించవచ్చు అండ్ ఎడిట్ చేయవచ్చు. దీని కోసం యాప్‌లోనే 'ఎడిట్ స్టిక్కర్' బటన్ అందుబాటులో ఉంటుంది.

click me!