సూపర్ క్రేజీ ఆఫర్! స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు.. ఆన్‌లైన్ షాపర్లకు గుడ్ న్యూస్ !

By Ashok kumar Sandra  |  First Published Jan 10, 2024, 10:08 AM IST

జనవరి 14 నుండి ఫ్లిప్‌కార్ట్ అండ్  అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్‌కు సిద్ధంగా ఉండండి. ఐఫోన్ 15, పిక్సెల్  8 వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్స్ ఇంకా ల్యాప్‌టాప్‌లపై హాట్ డీల్స్ అంతేకాదు ఇంకా మరెన్నో  అందుబాటులోకి రానున్నాయి. 
 


ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పాపులర్ ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్స్ తీసుకొస్తున్నట్లు సూచిస్తుంది. వీటి ధరలను వెల్లడించనప్పటికీ, బెస్ట్ డీల్స్‌లో iPhone 15, Pixel 7a, Samsung Galaxy S21 FE 5G, Motorola Edge 40 Neo ఇంకా మరెన్నో వంటి Apple డివైజెస్ పై డిస్కౌంట్స్ ఉండనున్నాయి.

మరోవైపు అమెజాన్   గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుండి ప్రారంభమవుతుంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఆక్సెసోరిస్ అండ్ మరిన్నింటిపై గొప్ప డీల్‌లను అందిస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవాళ్లు  ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇంకా  EMI లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపును ఆశించవచ్చు.

Latest Videos

iPhone 13, OnePlus Nord CE 3 Lite 5G, Samsung Galaxy S23,  Motorola Razr 40 Ultraతో సహా ప్రముఖ ఫోన్‌లపై Amazon డిస్కౌంట్లను టీజ్ చేసింది. ఈ సేల్‌లో గెలాక్సీ ఎస్ 24 సిరీస్, వన్‌ప్లస్ 12 సిరీస్, ఐక్యూ నియో 9 ప్రో, రెడ్‌మి నోట్ 13 సిరీస్ వంటి రాబోయే లాంచ్ లు కూడా ఉన్నాయి.

ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు పోటపోటీగా  డీల్స్  అందించడానికి రెడీగా ఉన్నాయి. అలాగే అమెజాన్ ఐఫోన్ 13ను తక్కువ ధరను వాగ్దానం చేస్తోంది. మీరు ఈ సేల్‌ను ఎక్కువగా ఉపయోగించాలనుకుంటున్న స్పెసిఫిక్  ఫోన్ మోడల్‌లను ట్రాక్ చేయండి. స్మార్ట్‌ఫోన్‌లకు మించి రెండు సేల్స్ లో ల్యాప్‌టాప్‌లపై 75 శాతం తగ్గింపు, స్మార్ట్‌వాచ్‌లపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. మీకు కొత్త ఫోన్ కావాలన్నా, ల్యాప్‌టాప్ కావాలన్నా లేదా యాక్సెసరీ కావాలన్నా ఈ రిపబ్లిక్ డే సేల్ లో గొప్ప డీల్‌లను పొందేందుకు ఒక సువర్ణావకాశం.

click me!