రంగులు మారే మొబైల్ చూశారా.. ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త 5జీ ఫోన్‌..

By asianet news telugu  |  First Published Sep 16, 2022, 3:55 PM IST

వివో దీని బ్యాక్ ప్యానెల్ కి కలర్ మారే ఫ్లోరైట్ AG గ్లాస్‌ ఇచ్చారు,  ఫోన్ వెలుతురులో ఉన్నప్పుడు దాని కలర్ ని మారుస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో  128 జీబీ స్టోరేజ్ ధర రూ.27,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.31,999.  


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  వివో  కలర్ మరే ఫోన్ సిరీస్ ను విస్తరించింది. కంపెనీ ఇండియాలో వివో వి25 సిరీస్‌ కింద వివో వి25ప్రొతో సహా  మరొక ఫోన్‌ను లాంచ్ చేసింది. తాజాగా వివో వి25 5జి స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. వివో వి25 5జి బ్యాక్ ప్యానెల్‌ కలర్ మరే గ్లాస్‌తో  పరిచయం చేసారు. ఈ ఫోన్ లో 64ఎం‌పి బ్యాక్ కెమెరా, 50ఎం‌పి సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లోని ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

 ధర 
వివో  వి25 5జి ఎలిగెంట్ బ్లాక్, సర్ఫింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. దీని బ్యాక్ ప్యానెల్ కి కలర్ మారే ఫ్లోరైట్ AG గ్లాస్‌ ఇచ్చారు,  ఫోన్ వెలుతురులో ఉన్నప్పుడు దాని కలర్ ని మారుస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో  128 జీబీ స్టోరేజ్ ధర రూ.27,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.31,999.  ప్రీ-బుకింగ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్, రూ. 2000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్  బిగ్ బిలియన్ డే సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. 

Latest Videos

undefined

ఫీచర్లు 
వివో వి25 5జికి 6.44-అంగుళాల FullHD+ AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌, MediaTek Dimensity 900 ప్రాసెసర్‌తో 12జి‌బి  వరకు ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. Android 12  FunTouch OS 12 ఫోన్‌లో  ఇచ్చారు. కంపెనీ ఈ ఫోన్‌తో రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందించబోతోంది. 

 కెమెరా
వివో వి25 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది,  64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ హెచ్‌డి కెమెరా ఉంది. 

బ్యాటరీ 
వివో వి25 5జిలో 4500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్ కోసం  ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 5G, 4G, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 186 గ్రాములు.

click me!