ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అంతేకాకుండా MediaTek Helio G96 ప్రాసెసర్, మూడు బ్యాక్ కెమెరాలతో పరిచయం చేసారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ RGBW + (G+P) లెన్స్.
చైనా మొబైల్ తయారీ సంస్థ టెక్నో అత్యంత స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని పేరు టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్. టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ కలర్ మారే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అంతేకాకుండా MediaTek Helio G96 ప్రాసెసర్, మూడు బ్యాక్ కెమెరాలతో పరిచయం చేసారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ RGBW + (G+P) లెన్స్.
ధర
టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్ ధర రూ.17,999. ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్‌తో వస్తుంది. అమెజాన్ లో సెప్టెంబర్ 22 నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఉంటాయి. అలాగే ఎస్‌బిఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌ను స్కై, సైబర్‌పంక్ ఇంకా డ్రీమీ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.
undefined
స్పెసిఫికేషన్‌లు
టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి ఫుల్ HD+ డిస్‌ప్లే, MediaTek Helio G96 ప్రాసెసర్, 8జిబి LPDDR4x ర్యామ్‌తో 128 జిబి స్టోరేజ్ అందించారు.
5జిబి వరకు వర్చువల్ ర్యామ్‌ను కూడా పొందుతుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12తో HiOS 8.6 ఉంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పాలిక్రోమాటిక్ ఫోటోఐసోమర్ టెక్నాలజీతో వస్తుంది, దీని సహాయంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ లైట్ ఉన్నప్పుడు రంగును మారుస్తుంది.
కెమెరా
ఈ ఫోన్ కి మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కూడా ఉంది. ఫోన్‌లోని రెండవ లెన్స్ 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ మోడ్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. టెక్నో ఈ ఫోన్ కి 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది.
బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీకి సంబంధించి 124 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇంకా వన్-టైమ్ ఛార్జింగ్ తర్వాత 37 రోజుల స్టాండ్‌బై క్లెయిమ్ చేసింది.