Vivo Smartphone: వివో నుంచి మ‌రో స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 21, 2022, 03:25 PM IST
Vivo Smartphone: వివో నుంచి మ‌రో స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌..!

సారాంశం

చైనా ఫోన్ సంస్థ వివో.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. V23 5G సిరీస్ లో భాగంగా V23e 5G స్మార్ట్ ఫోన్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.  

చైనా ఫోన్ సంస్థ వివో.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన V23 5G సిరీస్ లో భాగంగా V23e 5G స్మార్ట్ ఫోన్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది వివో. 5G సాంకేతికతతో పాటు అత్యాధునిక కెమెరా ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ యువతను ఆకట్టుకుంటుందని వివో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్ ఫోన్లలోనే అత్యంత “స్లిమ్” ఫోన్లుగా వివో V23 5G సిరీస్ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సిరీస్ లో మిగతా ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో..కొన్ని వర్గాల వారికీ చేరుకోలేకపోయామని భావించిన సంస్థ.. బడ్జెట్ ధరలో ఈ కొత్త V23e స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది.

V23e 5G ఫోన్ ప్రత్యేకతలు
7.32mm అల్ట్రా స్లిమ్ గ్లాస్ డిజైన్, 44ఎంపీ ఐ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 8GB+128GB స్టోరేజ్, 6.44-అంగుళాల 2400×1080 (FHD+) AMOLED డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా వెనుక 50MP+ 8MP + 2MP.. సామర్థ్యంగల AI ఆధారిత ట్రిపుల్ కెమెరా సెటప్ ఈఫోన్ లో ఉన్నాయి. 4050mAh బ్యాటరీతో, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఈ V23e 5G ఫోన్ లో ఉన్నాయి. వీడియో రికార్డింగ్ లో ఒకేసారి ముందు, వెనుక కూడా రికార్డు చేసుకునే అధునాతన ఫీచర్ ఇందులో ఆకట్టుకుంటుంది. హై రెసొల్యూషన్ ఆడియో, హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్.

ఇండియాలో రెడ్ మీ, రియల్ మీ, ఒప్పో, ఇంఫినిక్స్ వంటి ఫోన్ లకు వివో గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఏడాది భారత మార్కెట్లో మొత్తం 5జి ఫోన్లనే తీసుకురావాలని వివో నిర్ణయించుకుంది. అందులో భాగంగా వివిధ దశల్లో మొత్తం పది మోడళ్లను భారత విఫణిలోకి తెచ్చి మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తుంది. ఒప్పో, రెడ్మి ఫోన్లు సైతం భారత్ లో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే