టెక్నో స్పార్క్ 8సి ధర రూ.7,499. దీనిని మాగ్నెట్ బ్లాక్, ఐరిస్ పర్పుల్, డైమండ్ గ్రే, టర్కోయిస్ సియాన్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్స్ Amazon.in నుండి 24 ఫిబ్రవరి 2022 నుండి ప్రారంభమవుతుంది.
చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో (TECNO) కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 8సి (TECNO SPARK 8C)ని భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే టెక్నో స్పార్క్ 8సి 6జిబి ర్యామ్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో భారతదేశపు అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. నిజానికి ఈ ఫోన్ 3జిబి ర్యామ్ తో మాత్రమే ఉంటుంది, అయితే ఫోన్ అప్ డేట్ ద్వారా 3జిబి వర్చువల్ ర్యామ్ పొందుతుంది, అంటే మొత్తంగా 6జిబి ర్యామ్ ఉంటుంది. ఇందులో ఆక్టా-కోర్ ప్రాసెసర్ కూడా ఉంది.
టెక్నో స్పార్క్ 8సి ధర
టెక్నో స్పార్క్ 8సి ధర రూ.7,499గా నిర్ణయించారు. దీనిని మాగ్నెట్ బ్లాక్, ఐరిస్ పర్పుల్, డైమండ్ గ్రే అండ్ టర్కోయిస్ సియాన్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్స్ Amazon.in నుండి 24 ఫిబ్రవరి 2022 నుండి ప్రారంభమవుతుంది.
undefined
ఫీచర్స్
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiOS 7.6,90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 480 నిట్స్. ఆక్టా-కోర్ ప్రాసెసర్, అయితే దీని మోడల్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్ మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో వస్తుంది. అంటే 6 GB RAM (3 GB వర్చువల్ ర్యామ్) తో 64 జిబి స్టోరేజ్ ఉంటుంది.
కెమెరా
ఈ ఫోన్‌లో 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఏఐ బ్యూటీ 3.0, పోర్ట్రెయిట్ మోడ్, వైడ్ సెల్ఫీ, HDR, ఫిల్టర్లు వంటి ఎన్నో మోడ్‌లు కెమెరాతో అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ
ఫోన్‌లో IPX2 స్ప్లాష్ రెసిస్టెంట్, DTS సౌండ్, Soplay 2.0, HiParty, యాంటీ-ఆయిల్ స్మార్ట్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ 4G VoLTEతో 3-ఇన్-1 సిమ్ స్లాట్ ఉంది. 5000mAh బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 89 రోజుల వరకు, 53 గంటల టాక్-టైమ్‌తో వస్తుంది.