44ఎం‌పి సెల్ఫీ కెమెరాతో వివో నుండి మరో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

By S Ashok Kumar  |  First Published Apr 26, 2021, 5:43 PM IST

5జి స్మార్ట్ ఫోన్లకి పోటీగా వివో నుండి మరో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. దీనిని ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనున్నారు.
 


చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో  కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ వివో వి21 లాంచ్ తేదీని ప్రకటించింది. వివో వి21 పేరుతో వస్తున్న ఈ 5జి స్మార్ట్ ఫోన్  ఏప్రిల్ 29న ఇండియాలో లాంచ్ కానుంది. ఇంతకుముందే వివో వి21 గురించి సమాచారం  వెల్లడించినప్పటికి లాంచ్ తేదీ తెలపలేదు. ఇప్పుడు వివో వి21 5జి లాంచ్ పై ఫ్లిప్‌కార్ట్‌లో ఒక పేజీ కూడా ప్రత్యక్షమైంది. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి సమాచారం మీకోసం..

వివో వి21 5జి ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల కానుంది. దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. దీని డిస్ ప్లే శైలి వాటర్ డ్రాప్ నాచ్ అందించారు.

Latest Videos

ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర గురించి ఖచ్చితమైన సమాచారం లేదు, అయితే దీని ధర రూ .22,990గా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే వివో వి21 5జికి పోటీగా అనేక 5జి స్మార్ట్‌ఫోన్‌లు రూ .25 వేల ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి.

also read 

వివో ఇంతకుముందు  అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఆటో ఫోకస్ ఇచ్చింది.  వివో వి20 ప్రోలో 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అయితే దీనికి డ్యూయల్ లెన్స్ ఉంది. కానీ వివో వి21లో సింగిల్ లెన్స్ వస్తుంది. 

వివో వి21లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తోడ్పడుతుంది. మిగతా రెండు లెన్స్‌ల గురించి ప్రస్తుతం సమాచారం లేదు.

ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 లభిస్తుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ఫోన్‌లో 5జీకి సపోర్ట్ కూడా ఉంటుంది. ఫోన్ వనిల్లా మోడల్ ఇటీవల BIS వెబ్‌సైట్‌లో కనిపించింది.

click me!