5000ఎంఏహెచ్ బ్యాటరీతో వివో U10

Published : Oct 29, 2019, 05:50 PM ISTUpdated : Oct 29, 2019, 05:54 PM IST
5000ఎంఏహెచ్ బ్యాటరీతో వివో U10

సారాంశం

చైనా యొక్క BKK ఎలక్ట్రానిక్స్ యొక్క అనుబంధ సంస్థ స్మార్ట్ ఫోన్  బ్రాండ్ వివో U10ను విడుదల చేసింది. ఈ  ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ కలర్లలో లభ్యమవుతుంది.  వీటి ధర వరుసగా రూ .8,990, రూ .9,990 మరియు రూ .10,990.

చైనా యొక్క BKK ఎలక్ట్రానిక్స్ యొక్క అనుబంధ సంస్థ స్మార్ట్ ఫోన్  బ్రాండ్ వివో U10ను విడుదల చేసింది. ఈ  ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ కలర్లలో లభ్యమవుతుంది. దీనిలో ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి - 3 జిబి ర్యామ్ + 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జిబి ర్యామ్ + 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4 జిబి ర్యామ్ + 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్, వీటి ధర వరుసగా రూ .8,990, రూ .9,990 మరియు రూ .10,990.


వివో U10 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు గ్రేడియంట్ రిఫ్లెక్టివ్ డిజైన్, ముందు భాగంలో డ్యూడ్రాప్ ఆకారంలో ఉన్న నాచ్ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో అధిక సామర్థ్యం గల బ్యాటరీ మరియు ఫోన్ అన్‌లాక్ మెకానిజం కోసం కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. 

also read  గాలి నాణ్యతను పెంచే కొత్త ఎయిర్ ప్యూరిఫైర్...

వివో U10 లక్షణాలు: వివో యు 10 6.5-అంగుళాల హెచ్‌డి + రిజల్యూషన్‌, 19.5:9 ఆస్పెక్ట్  రేషియో కలిగి ఉంది. స్క్రీన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ ఆకారం,సెల్ఫీ కెమెరా, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపి అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

also read  ప్రపంచంలోనే అతిచిన్న కెమెరా సెన్సార్

ఫోన్‌ను శక్తివంతం చేయడం కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 సిస్టమ్-ఆన్-చిప్, 4 జిబి ర్యామ్ , 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది - మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్ అల్ట్రా-గేమింగ్ మోడ్‌తో లోడ్ అవుతుంది.  ఇది 4డి వైబ్రేషన్స్, గేమ్ కౌంట్‌డౌన్, వాయిస్ ఛేంజర్ వంటి అదనపు గేమ్-సంబంధిత అనుకూలీకరణలను అందిస్తుంది. ఫోన్‌తో 5,000W mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Agri Technology : పశువులు మేపడానికి 'డిజిటల్ స్టిక్' ఏంటి భయ్యా..! దీని హైటెక్ ఫీచర్లు తెలిస్తే షాక్..!!
Price Drop on TVs : శాంసంగ్ స్మార్ట్ టీవిపై ఏకంగా రూ.17,000 తగ్గింపు.. దీంతో మరో టీవి కొనొచ్చుగా..!