నేడు సోషల్ మీడియా ఒక ప్రయోగాత్మక స్కూల్ లాంటిది ఇంకా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి ఒక్కరూ వెరైటీగా ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా చిల్లర నాణేలతో ఐఫోన్ షాప్‌కి వెళ్తే అక్కడున్న వారి స్పందన తెలుసుకునేందుకు ఓ యువకుడు బిచ్చగాడి బట్టలతో ప్రయోగం చేయగా, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఐఫోన్లు అమ్మే షాప్‌కి వెళ్లి ఐఫోన్ 15 కొంటున్న బిచ్చగాడి వీడియో వైరల్‌గా మారింది...! కాకపోతే ఐఫోన్ కొన్నది నిజమైన బిచ్చగాడు కాదు, బిచ్చగాడి వేషంలో ఉన్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. అతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేడు సోషల్ మీడియా ఒక ప్రయోగాత్మక స్కూల్ లాంటిది ఇంకా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి ఒక్కరూ వెరైటీగా ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా చిల్లర నాణేలతో ఐఫోన్ షాప్‌కి వెళ్తే అక్కడున్న వారి స్పందన తెలుసుకునేందుకు ఓ యువకుడు బిచ్చగాడి బట్టలతో ప్రయోగం చేయగా, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సాధారణంగా ప్రజలు ఐఫోన్ (iphone 15) అధిక ధర కారణంగా కొనేందుకు వెనుకడుగు వేస్తారు. అయితే అప్పు చేసి కొనాల్సిన పరిస్థితిలో ఓ బిచ్చగాడు ఐఫోన్ కొనేందుకు వెళితే జనాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చిన్న ప్రయోగం చేశాడు. ఈ వీడియో ఎక్స్‌పెరిమెంట్ కింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అప్‌లోడ్ చేయబడింది.
వీడియోలో, ఒక యువకుడు బిచ్చగాడి వేషంలో జోధ్‌పూర్‌లోని మొబైల్ షోరూమ్‌కు ఐఫోన్ కొనడానికి చిల్లర నాణేలతో కూడిన బ్యాగ్‌తో వెళ్లాడు. కానీ చాలా మొబైల్ షోరూమ్‌లు అతని మురుకి బట్టల వేషాన్ని చూసి మొబైల్ షోరూమ్‌లోకి అనుమతించలేదు,
మరికొంతమంది చిల్లర నాణెంల కారణంగా ఐఫోన్ కొనాలని అతని కోరికపై నీరు చల్లారు. కానీ చివరకు ఒక మొబైల్ షోరూమ్ అతని దగ్గర ఉన్న కాయిన్‌లని తీసుకొని ఐ ఫోన్‌ను కొనేందుకు అంగికరించింది. తరువాత ఆ యువకుడు తన చేతిలో ఉన్న నాణేల బ్యాగ్‌ని మొబైల్ షోరూమ్ టేబుల్‌పై పోశాడు. అప్పుడు అక్కడి సిబ్బంది అంతా కలిసి ఈ నాణేలన్ని లెక్కించేందుకు రెడీ అయ్యారు. చివరికి అతనికి ఐఫోన్ 15 అందించారు. ఈ బిచ్చగాడు షాప్ యజమానితో ఐ ఫోన్ తీసుకుంటు ఫోటో కూడా దిగాడు. మరోవైపు అక్కడ ఉన్న కొందరు ఆశ్చర్యంగా అతనివైపు చూసారు.
వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 34 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ ప్రయోగాన్ని, అలాగే బిచ్చగాడిని లోపలి రానిచ్చిన షాపు యజమానిని పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ఇది ప్లాన్ చేసి స్క్రిప్ట్‌తో చేసారని ఒకరు ఫిర్యాదు చేయగా, వినోదాత్మకంగా, ఆలోచింపజేసే వీడియో అని మరొకరు కామెంట్ చేసారు. కస్టమర్లు ఎవరైనా సరే వారిని గౌరవించాలని మరొకరు అన్నారు.
Apple iPhone 15 సిరీస్ ఫోన్ సెప్టెంబర్ 22 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంది. లాంచ్ కి ముందు ప్రజలు ఢిల్లీ ఇంకా ముంబైలోని ఆపిల్ రిటైల్ స్టోర్స్ బయట క్యూలలో దర్శనమిచ్చారు. 128 GB బేస్ స్టోరేజ్‌తో iPhone 15 ధర 79,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900. అదేవిధంగా, 128GB iPhone 15 Pro ధర 1,34,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro Max ధర రూ.1,59,900.