రూ.498కే ఐఫోన్, రూ.476కే సోనీ టీవీ, రూ.495కే యాపిల్ వాచ్.. ఇలాంటి యాడ్ ఆఫర్స్ ఎక్కడైనా చూసారా..?

By asianet news telugu  |  First Published Oct 5, 2023, 6:07 PM IST

 ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల పేరుతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే నకిలీ షాపింగ్ సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ లుక్ లోనే నిజమైన సైట్ లాగా కనిపించే ఈ సైట్లలోకి వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.


ఫెస్టివల్ సీజన్ మొదలైంది... మరోకొద్ది రోజుల్లో దసరా హాలిడేస్ కూడా వచ్చేస్తాయి. దింతో అందరి దృష్టి షాపింగ్  పైనే ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ సైట్లు కూడా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో 

  ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల పేరుతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే నకిలీ షాపింగ్ సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ లుక్ లోనే నిజమైన సైట్ లాగా కనిపించే ఈ సైట్లలోకి వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. 

Latest Videos

రూ.498కే ఐఫోన్, రూ.476కే సోనీ టీవీ, రూ.495కే యాపిల్ వాచ్.. వంటి ప్రకటనలు చూసి బుక్ కావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇటువంటి ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు ఇలాంటి యాడ్స్ ఉన్న లింక్‌పై క్లిక్ చేసి చూసినప్పుడు ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ వంటి నిజమైన షాపింగ్ సైట్‌లు అని మీకు వెంటనే అనిపిస్తుంది. ఒరిజినల్ సైట్ లాంటి  డే డీల్ వంటి రకరకాల ఆఫర్‌లను కూడా ఇందులో చూడవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా ఫేక్ సైట్‌లోకి  వెళ్లారని  తెలుసుకోవాలి. 

ఫేక్ ఆఫర్ సైట్‌లను గుర్తించడానికి పైన ఉన్న వాటి  వెబ్‌సైట్ అడ్రస్ జాగ్రత్తగా చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి మోసాల పట్ల కస్టమర్లు  మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

 పోలీసుల హెచ్చరిక

ప్రముఖ ఇ-కామర్స్ సైట్‌ల పేరును ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఆఫర్‌లను ప్రచారం చేసే నకిలీ షాపింగ్ సైట్‌ల పట్ల జాగ్రత్త వహించండి. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ మోసాలు చేస్తున్నారు. మొదటి చూపులో నిజమైన సైట్ లాగా కనిపించే ఈ సైట్లలో ఆర్డర్లు పెట్టి నష్టపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి నకిలీ సైట్‌లను గుర్తించాలంటే వాటి వెబ్‌సైట్ అడ్రస్‌ను జాగ్రత్తగా చూసి చెక్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి మోసాల పట్ల వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. 

click me!