ట్విటర్‌ సంచలన నిర్ణయం...తెలిస్తే షాకవ్వాల్సిందే!

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2019, 12:56 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం అమలులోకి రానుంది . నవంబరు 22 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మరిన్ని పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తాం అని  ట్విటర్‌ సీఈవో తెలిపారు. 

సోషల్‌మీడియాలో ఒకటైన దిగ్గజ సంస్థ ట్విటర్‌  సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక( ట్విట్టర్)  నుండి నిషేధించనుంది.  వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.  

తమ వేదికపై రాజకీయ ప్రకటనలను నిషేధిస్తుందని ట్విటర్‌ చీఫ్ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే బుధవారం తెలియజేసారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు" అని డోర్సే ట్వీట్ చేశారు.

also read వాయిస్ కంట్రోల్‌తో ఎంఐ స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2

 ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామని, నవంబర్ 22 వ తేదీ నుంచి  అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్‌ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ  అపహాస్యం చేయడం గమనార్హం.

ట్విట్టర్ నిర్ణయాన్ని రాజకీయ, సాంకేతిక నిపుణులు అంచనా వేయలేదు. నవంబర్ 22 తర్వాత సంస్థ బిజినెస్ గణనీయంగా దెబ్బ తింటుందని భావిస్తున్నారు. సంస్థ సీఈఓ డోర్సీ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.9 శాతం సంస్థ షేర్లు పతనమయ్యాయి. 
 
ట్విట్టర్ తోపాటు సోషల్ మీడియా సంస్థలు ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నాయని విమర్శలను, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా పరోక్షంగా ఫేస్ బుక్ ఆధారంగా ప్రచారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 

ట్విట్టర్ సీఈఓ ప్రకటనను డెమోక్రాట్ల తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జాయ్ బిడెన్ ప్రచార డైరెక్టర్ బిల్ రస్సో అభినందించారు. విదేశాల్లో జాయ్ బిడెన్ కొడుకు హంటర్ వ్యాపార లావాదేవీల ఆధారంగా ఆయనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
click me!