నో బోరింగ్.. ఇక వాట్సాప్ ట్రూలీ పర్సనల్

By narsimha lodeFirst Published Feb 17, 2019, 1:01 PM IST
Highlights

ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరో బ్రహ్మాండమైన వసతిని అందుబాటులోకి తేనున్నది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది.
 

న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరో బ్రహ్మాండమైన వసతిని అందుబాటులోకి తేనున్నది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది.

ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్‌ చేసుకోవాల్సి రావడంతో వాట్సాప్ యూజర్లు విసుగెత్తిపోతున్నారు. ఇటువంటి వినియోగదారులు తమకు ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి బయటకు వచ్చే అవకాశం ఉంటే ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే ఫీచరే. 

ఎందుకంటే  ఏదైనా గ్రూపులో చేరాలా వద్దా? అనేది  ఇకపై వాట్సాప్‌  వినియోగదారుల చేతుల్లోనే ఉండబోతోంది. ఎవరు బడితే వారు, గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌ మూడు ఆప‍్షన్లను తీసుకురానున్నది. 

ఒక వెబ్ సైట్ పేర్కొన్న సమాచారం మేరకు వాట్సాప్ ఇన్విటేషన్‌ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా..అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకు రానున్నది. తమను  గ్రూప్స్‌లోకి ఎవరు జోడించవచ్చో స్వయంగా యూజర్లే ఎంపిక చేసుకోవడానికి అనుమతించే ఫీచర్‌ ఇది. దీని ప్రకారం ప్రైవసీ సెటింగ్స్‌లో మూడు ఆప్లన్లు ఉంటాయి.

దీని ప్రకారం ఎవరికీ మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూపులో జోడించే అవకాశం  ఉండదు. కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్‌ చేసేందుకు అనుమతినివ్వాల్సి ఉంటుంది. యూజర్‌ పరిచయం లేకపోయినా,  కాంటాక్ట్స్‌లో లేకపోయినా  గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినిస్తారు. 

ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటాకి పరిచయం మవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం టెస్ట్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది, ఆసక్తి గల వారు దాని కోసం ప్రయత్నించవచ్చునని వాట్సాప్ పేర్కొంది. 

బగ్స్‌ ఎటాక్‌, క్రాష్‌లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ సూచించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే,  ఈలింక్‌పై  క్లిక్‌ చేసి టెస్టింగ్‌ ప్రోగ్రాం నుంచి  వైదొలగవచ్చని వాబేటా అనే వెబ్ సైట్ ప్రచురించిన నివేదిక పేర్కొంది.
 

click me!
Last Updated Feb 17, 2019, 1:01 PM IST
click me!