గేమ్ చేంజ్: 28న భారత విపణిలోకి ‘రెడ్ మీ నోట్7’

By Siva Kodati  |  First Published Feb 15, 2019, 12:13 PM IST

మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారిని ఆకట్టుకున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ తాజాగా మరో మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ నెల 28న భారత మార్కెట్లో అడుగిడనున్న రెడ్ మీ 7 నోట్.. మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోనే గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తేల్చేశారు.


న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌ మీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లకు  అంతర్జాతీయంగా ఉన్న క్రేజీ అందరికీ తెలిసిందే. ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. 

ఈ సంస్థ నుంచి కొత్త మోడల్స్‌ ఎప్పుడొస్తాయా అంటూ యువత ఆశగా ఎదురు చూస్తోంది.వీటి అమ్మకాలు భారత్‌లో కూడా ఎక్కువే. ప్రస్తుతం ఇండియాలోనే ఈ ఫోన్లకే ఎక్కువ వినియోగదారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Latest Videos

undefined

రెడ్‌మీ నోట్‌7 త్వరలో భారత్‌ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నది. గత నెలలో ఇది చైనాలో విడుదలై మంచి గుర్తింపు పొందింది. కేవలం మూడు వారాల్లోనే ఒక మిలియన్‌ ఫోన్లు అమ్ముడయ్యాయని చైనా మార్కెట్‌ వర్గాల కథనం. 

చైనా తర్వాత మొదట ఇండియాలోనే నోట్‌7ను విడుదల చేస్తున్నారు. భారత్‌లో ఈ నెల 28వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తామని సంస్థ అధికారులు గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రెడ్ మీ నోట్ 7 మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు ట్విలైట్ గోల్డ్, ఫాంటసీ బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఉంటుందని ఇమేజెస్ లీకయ్యాయి. కానీ భారత్‌లో ఎరుపు, నలుపు, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో ఎంత ధరకు ఈ ఫోన్లను విక్రయించనున్నారో చెప్పలేదు.

చైనాలో మాత్రం 3జీబీ రామ్‌+32జీబీ  స్టోరేజ్‌ సామర్థ్యం ఉన్న ఫోన్ రూ.10,300, 4జీబీ రామ్‌+64 రూ.12,400, 6జీబీ రామ్‌+64జీబీ రూ.14,500లకు విక్రయించారు. భారత్‌లో కూడా ఇవే ధరలు ఉండొచ్చని రెడ్ మీ భారత్ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో గేమ్ చేంజర్ కానున్నదన్నారు.

రెడ్‌మీ నోట్‌7 ఫోన్ గొరిల్లా గ్లాస్‌5 లేయర్‌తోపాటు 6.3 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్ ప్లే, కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 660ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ , ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పనిచేయనున్నది. డ్యూయల్‌ కెమేరా(48+5), సెల్ఫీకోసం 13 ఎంపీ కెమెరాను పొందుపర్చారు. 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంలో తక్కువ సమయంలోనే చార్జ్‌ అయ్యేలా దీన్ని రూపొందించారు.  

click me!