తగ్గిన వివో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు.. ఐ‌సి‌ఐ‌సి‌ఐ కార్డుతో అదనంగా క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు..

By asianet news telugu  |  First Published Apr 19, 2022, 6:48 PM IST

వివో వై15ఎస్ ధర గతంలో రూ.10,990 నుండి రూ.10,490కి  తగ్గింది. మీరు ఐ‌సి‌ఐ‌సి‌ఐ కార్డ్‌తో చెల్లిస్తే మీరు అదనంగా రూ. 1,000 క్యాష్‌బ్యాక్  కూడా పొందుతారు.
 


మీరు కూడా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా అయితే వివో (Vivo) రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు చౌకగా మారాయి. వివో 33టి (Vivo 33T), వివో వై15ఎస్ (Vivo Y15s)ని తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. వివో 33టి కొత్త ధర ఇప్పుడు రూ.17,990కి చేరింది గతంలో దీని ధర రూ. 18,990.  అలాగే వివో వై15ఎస్ ధర ఇప్పుడు రూ. 10,990 నుండి  రూ. 10,490కి  తగ్గింది.

మీరు ICICI కార్డ్‌తో  పేమెంట్ చేస్తే మీరు అదనంగా రూ. 1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Vivo 33T ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ మిగిలిన రెండు లెన్స్‌లు 2-2 మెగాపిక్సెల్‌లు. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వివో 33టిలో 6.58-అంగుళాల FHD + డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లభిస్తుంది.

Latest Videos

వివో వై15ఎస్ స్పెసిఫికేషన్‌లు
ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారంగా ఫన్‌టచ్ OS 11.1 వివో వై15ఎస్ లో అందించారు. దీనిలో 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Helio P35 ప్రాసెసర్, 3జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. ఫోన్‌తో పాటు 1జి‌బి వరకు ఎక్స్ టెండెడ్ ర్యామ్ అందుబాటులో ఉంది.

వివో వై15ఎస్ కెమెరా
వివో వై15ఎస్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు ఎపర్చరు f/2.2 ఉంది. రెండవ లెన్స్ f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ సూపర్ మాక్రో లెన్స్. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

వివో వై15ఎస్ బ్యాటరీ
ఈ వివో ఫోన్‌లో 4G, మైక్రో USB, బ్లూటూత్ v5.0, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అంతే కాకుండా ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. దీనితో పాటు 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ అమర్చారు.

click me!