రియల్ మీ క్యూ5ఐ 90Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్ తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు.
రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్ మీ క్యూ5ఐ (Realme Q5i)ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్ మీ క్యూ5ఐలో MediaTek డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చారు. అంతేకాకుండా 34 రోజుల స్టాండ్‌బై క్లెయిమ్ చేయబడిన 5000mAh బ్యాటరీ ఉంది. రియల్ మీ క్యూ5ఐలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.
Realme Q5i price
రియల్ మీ క్యూ5ఐ (Realme Q5i) ధర ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది . రియల్ మీ క్యూ5ఐ 4జిబి ర్యామ్ తో 128జిబి స్టోరేజ్ ధర 1,199 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 14,300. 6జిబి ర్యామ్ తో 128జిబి స్టోరేజ్ ధర 1,299 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 15,500. రియల్ మీ క్యూ5ఐని గ్రాఫైట్ బ్లాక్ అండ్ అబ్సిడియన్ బ్లూ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
undefined
రియల్ మీ క్యూ5ఐ స్పెసిఫికేషన్లు
రియల్ మీ క్యూ5ఐ 90Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్, 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు. కెమెరాతో నైట్ మోడ్ అండ్ ఏఐ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ముందు కెమెరా గురించిన సమాచారం అందుబాటులో లేదు.
రియల్ మీ క్యూ5ఐ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ప్యాక్ చేస్తుంది. ఈ బ్యాటరీ 95 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ క్లెయిమ్ చేయబడింది. అలాగే ఈ ఫోన్ 8.1mm అల్ట్రా-స్లిమ్ బాడీతో లభిస్తుంది. వెనుక ప్యానెల్ కెవ్లార్ ఫైబర్ టేక్శ్చర్ తో వస్తుంది. ఫోన్‌తో పాటు 5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది.