ఈ యాప్స్ ఫోన్‌లో ఉంటే ఫోటోలు, డేటా లీక్.. సైబర్ సెక్యూరిటీ అలర్ట్..

By Ashok kumar SandraFirst Published Jan 2, 2024, 5:09 PM IST
Highlights

ఇవి యూజరుకు తెలియకుండానే ఫోన్‌లోకి ఇతర ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేయగలవు, తద్వారా డీవైజెస్ పై పూర్తి కంట్రోల్ పొందవచ్చు.  ఈ యాప్‌లు ఫోన్‌లో ఫోటోలు, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేసి ఉండవచ్చు అలాగే  ప్రకటనలపై క్లిక్ చేయడం వంటి ఫైనాన్షియాల్  టార్గెట్స్ తో ఉండవచ్చు. 

ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుండి డేటాను హ్యాక్ చేయగల, డివైజెస్ కూడా కంట్రోల్ చేయగల కొన్ని యాప్‌ల గురించి సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ హెచ్చరించింది. ఫోన్‌లో ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి రన్ అవుతున్నప్పటికీ, అవి సమానంగా ఫోన్‌లో కొన్ని ఇతర పనులను కూడా చేస్తాయి. ఈ యాప్‌లు యూజరుకు తెలియకుండా రహస్యంగా ఈ పని చేస్తాయి, ఇందుకు ఫోన్‌లో వివిధ యాక్సెస్  పొందడానికి సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగిస్తాయి అలాగే  వీటితో  అనుబంధించబడినవి కమాండ్, కంట్రోల్ సర్వర్‌తో కమ్యూనికేట్ చేస్తాయి అలాగే తయారీదారులకు అవసరమైన విధంగా పనిచేస్తాయి.

ఇవి యూజరుకు తెలియకుండానే ఫోన్‌లోకి ఇతర ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేయగలవు, తద్వారా డీవైజెస్ పై పూర్తి కంట్రోల్ పొందవచ్చు.  ఈ యాప్‌లు ఫోన్‌లో ఫోటోలు, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేసి ఉండవచ్చు అలాగే  ప్రకటనలపై క్లిక్ చేయడం వంటి ఫైనాన్షియాల్  టార్గెట్స్ తో ఉండవచ్చు. ఫోన్ యాక్సెస్, తెలియకుండా డివైజ్లోని సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా ఇలాంటి యాప్ లను ఫోన్ల నుంచి తొలగించాలని సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్న వారు చెబుతున్నారు.

Latest Videos

McAfee   లిస్టులోని  13 ఆన్‌డ్రాయిడ్ యాప్‌లు..
1. Essential Horoscope for Android
2. 3D Skin Editor for PE Minecraft
3. Logo Maker Pro 
4. Auto Click Repeater
5. Count Easy Calorie Calculator
6. Sound Volume Extender
7. LetterLink
8. Numerology: Personal horoscope & number predictions
9. Step Keeper: Easy Pedometer
10. Track Your Sleep 
11. Sound Volume Booster 
12. Astrological Navigator: Daily Horoscope & Tarot
13. Universal Calculator 

click me!