SuperBrain : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో విప్లవం ... ఏమిటీ న్యూరోకాగ్నిటివ్ AI మోడల్‌?

Published : Mar 08, 2025, 09:05 AM IST
SuperBrain : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో విప్లవం ... ఏమిటీ న్యూరోకాగ్నిటివ్ AI మోడల్‌?

సారాంశం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మానవ మేధస్సును మించేలా సూపర్ బ్రెయిన్ అనే కొత్త ప్లాట్‌ఫారం రాబోతోంది. ఇది న్యూరోకాగ్నిటివ్ AI మోడల్‌తో మానవ ఆలోచనలను మరింత పదును పెట్టడానికి, మేధో వికాసానికి తోడ్పడుతుంది.

SuperBrain : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా నడుస్తోంది. మానవ మేధస్సునే మించిపోయేలా ఏఐ అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక ఏఐ ప్లాట్ ఫామ్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఏఐని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు సూపర్ బ్రెయిన్ అనే కొత్త ప్లాట్ ఫారం సిద్దమయ్యింది. టెక్ ఇన్వెస్టర్, ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్ డేవిడ్ అబిక్జిర్, మీడియా దిగ్గజం నీరజ్ కోహ్లీ నేతృత్వంలో రూపొందిన ఈ 'SuprBrain' వినూత్న న్యూరోకాగ్నిటివ్ AI మోడల్ (NG-AI) ని అందుబాటులోకి తీసుకువస్తోంది. 

ఈ న్యూరోకాగ్నిటివ్ ఏఐ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మానవ ఆలోచనలు ఏఐ సహాయంతో మరింత పదును పెట్టవచ్చు... దీనివల్ల మానవ ఆలోచనా శక్తి మరింత విస్తరిస్తుంది. దీని వల్ల కొత్త ఆలోచనల మార్పిడి, మేధో వికాసం మరింత సమర్థవంతంగా జరుగుతుందని అంటున్నారు.

సెర్చ్ ఇంజిన్ టు థాట్ ఇంజిన్ :

SuprBrain ఒక థాట్ యాంప్లిఫికేషన్ సిస్టమ్ (Thought Amplification System)‌గా పనిచేస్తుంది. ఇది వినియోగదారుల ఆలోచనలను మెరుగుపరచడంతో ఉపయోగపడుతుంది. వారి వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుతూ, ఆలోచనలను స్పష్టంగా రూపకల్పన చేయడంలో సహాయపడుతుంది. మానవ భావ వ్యక్తీకరణకు ఏఐ ఆధారిత అధునికతను మిళితం చేస్తుంది. అంటే మన ఆలోచనా విధానానికే మరింత మెరుగులు అద్దుతుంది... అంతేగానీ పూర్తిగా మన ఆలోచనను దారిమళ్లించదు. 

ప్రస్తుత AI మోడల్స్ ప్రధానంగా రెండు రకాలుగా పనిచేస్తున్నాయి. ఒకటి లాంగ్వేజ్ మోడల్స్ (Language Models).. ఇది మనకు కావాల్సిన టెక్ట్స్ ను అందిస్తుంది. ఇంకోటి డిఫ్యూషన్ మోడల్స్ (Diffusion Models)... ఇది మల్టీమీడియా కోసం ఉపయోగపడుతోంది. ఇవి సాంకేతికంగా గొప్ప పురోగతిని సాధించినా వ్యక్తిగత అవసరాలకు పూర్తిగా సరిపోని స్థితిలో ఉన్నాయి.

అయితే ఈ సూపర్ బ్రెయిన్ న్యూరోకాగ్నిటివ్ ఏఐ సరికొత్తగా రూపొందింది. ఇది వినియోగదారులకు డైనమిక్ నాలెడ్జ్ గ్రాఫ్స్‌ను (Dynamic Knowledge Graphs) రూపొందిస్తుంది. దీని ద్వారా ఏఐ ప్రతి యూజర్‌కు ప్రత్యేకమైన, లోతైన వివరాలను అందించగలుగుతుంది. అంతేకాకుండా డేటా పునరావృతం కాకుండా తగ్గించడంతో పాటు అనవసర విషయాలను తగ్గిస్తుంది.

 సూపర్ బ్రెయిన్ లో న్యూరోకాగ్నిటివ్ AI (NG-AI) ప్రత్యేకత ఏమిటి?
 
ప్రస్తుత జనరేటివ్ AI చాలా సాధారణంగా లేదా స్థిరంగా ఉంటుంది. ఇది వినియోగదారుని ఆలోచనలకు అనుగుణంగా మార్పు చెందడం లేదని డేవిడ్ అబిక్జిర్ తెలిపారు. కానీ సూపర్ బ్రెయిన్ తో తాము ఒక కొత్త AI మోడల్‌ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇది కేవలం కంటెంట్‌ను సృష్టించేది మాత్రమే కాదు, వినియోగదారుని మేధో పరిణామంతోపాటు అభివృద్ధి చెందుతుందన్నారు.

సూపర్ బ్రెయిన్ అనేక కొత్త ప్రయోజనాలను అందిస్తుంది:

ఆలోచనల మధ్య సమ్మిళిత సంబంధాలు (Interconnected Ideas)

టెక్స్ట్, ఆడియో, ఇమేజెస్, వీడియో వంటి మల్టీ-మోడల్ లెర్నింగ్

కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని అభివృద్ధి చెందే మేధస్సు

సూపర్ బ్రెయిన్ ప్రత్యేకంగా ఎలా పని చేస్తుంది?

సాంప్రదాయ ఏఐ మోడల్స్ ముందుగా స్థిరంగా ఉన్న నియమాలను అనుసరించగా,సూపర్ బ్రెయిన్ వినియోగదారుల కమాండ్స్ ను అనుసరించి తన లెర్నింగ్ పాత్‌ను మారుస్తుంది.

"AI కి చాలా కీలకమైన సవాలు – వినియోగదారుని ఆలోచనలతోపాటు అభివృద్ధి చెందే వ్యవస్థను ఎలా రూపొందించాలి అనేదే. మేము ఈ సమస్యను SuprBrain ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం" అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అభిజిత్ ప్రహ్లాద్ తెలిపారు.

సూపర్ బ్రెయిన్ భవిష్యత్ ప్రణాళికలు :

సూపర్ బ్రెయిన్ ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. 2025లో దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

ఈ ప్లాట్‌ఫామ్ AI ఆధారిత వ్యక్తిగతీకరణను మిళితం చేస్తూ, వినియోగదారులకు "మేధో సంపత్తిని సృష్టించడంతోపాటు, దాన్ని ఆర్థికంగా మార్చుకునే" అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా సాంప్రదాయ కంటెంట్ ఎకానమీలో మార్పు తేవడంతో పాటు, AI ద్వారా సృజనాత్మక ఆలోచనల వ్యాప్తికి దారి తీసే విప్లవాత్మక మార్గాన్ని రూపొందించనుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

WhatsApp : ఇక పేరెంట్స్‌కు నో టెన్షన్.. పిల్లల వాట్సాప్ ను మీరే హ్యాండిల్ చేయవచ్చు, ఎలాగో తెలుసా?
LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు