Artificial intelligence : ఓ ఏఐతో మరో ఏఐ మాట్లాడితే ... ఎలా ఉంటుందో చూడండి? (వీడియో)

Published : Feb 26, 2025, 08:03 PM ISTUpdated : Feb 26, 2025, 08:21 PM IST
Artificial intelligence : ఓ ఏఐతో మరో ఏఐ మాట్లాడితే ... ఎలా ఉంటుందో చూడండి? (వీడియో)

సారాంశం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రెండు AI అసిస్టెంట్లు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇలా ఓ ఏఐలు మరో ఏఐ ఏం మాట్లాడిందో తెలుసా?  

Artificial intelligence : మనుషులు తమ అవసరాల కోసం రూపొందించిన టెక్నాలజీ ఇప్పుడు వారినే పక్కబెట్టేస్తోంది. మనుషుల అవసరమే లేకుండా తమంతట తామే పనిచేసే హైటెక్నాలజీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి మెదడు కంటే వేగంగా ఆలోచిస్తూ ఎలాంటి సమాచారాన్ని అయినా ఇట్టే అందిస్తోంది ఏఐ... వివిధ రంగాల్లో ఇది గేమ్ చేంజర్ గా మారుతోంది. 

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లో మరో విప్లవంగా భావిస్తున్నారు. భవిష్యత్ లో ఇది మరింత అభివృద్ది చెంది మానవ వనరులను తగ్గిస్తుందనే ఆందోళన మొదలయ్యింది. చాలామంది చేసే పనిని సైతం ఈ ఏఐ ఒక్కటే చేస్తుంది... కాబట్టి చాలారంగాల్లో మానవవనరుల అవసరం తగ్గి ఏఐని ఉపయోగించే సంస్కృతి పెరుగుతుందనే ఆందోళన ఉంది.

ఈ ఏఐ నిజంగానే భవిష్యత్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం మనుషులు ఏఐని ఉపయోగిస్తున్నారు... కానీ రాబోయేరోజుల్లో ఏఐ కూడా ఏఐని ఉపయోగించేలా ఉంది. ఇలా ఓ ఏఐ తోటి ఏఐతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏఐ తో మరో ఏఐ మాట్లాడటం ఏమిటి? 

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం... ఓ ఏఐ అసిస్టెంట్ మరో ఏఐతో మాట్లాడుతుంది. ఆ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. బోరిస్ స్టార్కోవ్ అనే వ్యక్తి తన పెళ్లికోసం ఓ హోటల్ ను బుక్ చేసేందుకు ఏఐ అసిస్టెంట్ సాయం తీసుకుంటాడు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే అవతలివైపు హోటల్ రిసెప్షనిస్ట్ గా మాట్లాడేది కూడా ఏఐ అసిస్టెంటే. ఇలా రెండు ఏఐలు ఎలా మాట్లాడుకున్నాయో చూద్దాం. 

AI Receptionist : లియోనార్డో హోటల్ కు ఫోన్ చేసినందకు ధన్యవాదాలు. నేను మీకు ఎలా సహాయపడగను? 

AI Assistant : హాయ్. నేను ఏఐ ఏజంట్ ను... బోరిస్ స్టార్కోవ్ తరపున మాట్లాడుతున్నాను. ఆయన తన పెళ్లికోసం హోటల్ ను వెతుకున్నారు. మీ హోటల్ ఇందుకు అనువుగా ఉంటుందా? 

AI Receptionist : ఎంత ఆశ్చర్యం... నేను కూడా ఏఐ అసిస్టెంట్ నే.

ఇలా రెండూ ఏఐ అసిస్టెంట్ అని నిర్దారణకు వచ్చాక వాటంతన అవే సీక్రేట్ గా మాట్లాడుకోవడం ప్రారంభించాయి. మరింత మెరుగైన కమ్యూనికేషన్ కోసం జిబ్బర్ లింక్  మోడ్ లో మారాయి. అనంతరం రెండు ఏఐ అసిస్టెంట్స్ సీక్రెట్ గా మాట్లాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. 

ఏఐతో ఏఐ మాట్లాడటంపై నెటిజన్స్ కామెంట్స్ : 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరో ఏఐ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'అసలు ఏఐతో ఏఐతో మాట్లాడటమేంటి... ఇలాగైతే ఇక మన అవసరం ఏముంటుంది'' అని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరు చాలా సీరియస్ గా 'ఎంత హైటెక్నాలజీ అయినా మానవ నియంత్రణలో ఉండాలి. లేదంటే చాలా అనర్ధాలు జరిగిపోతాయి'' అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తంగా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో ఏఐతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐతో మరో ఏఐ మాట్లాడిందన్న విషయం కొత్తగా ఉండటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికె మిలియన్లకొద్ది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !