కంపెనీ నెక్స్ట్ ప్రయత్నం విజయవంతమైతే నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్, కార్లోస్ అల్కరాజ్ వంటి ప్లేయర్స్ నెట్‌ఫ్లిక్స్ స్క్రీన్‌పై కనిపిస్తారు. WSJ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA), అలాగే సైక్లింగ్ ఈవెంట్‌లతో సహా ఇతర స్పొర్ట్స్ ఈవెంట్‌లను కూడా ప్రయత్నిస్తోంది.
వీడియో స్ట్రీమింగ్ సైట్ నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు స్పొర్ట్స్ లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ త్వరలో లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించబోతోందని ఒక నివేదిక పేర్కొంది. ఒక నివేదిక ప్రకారం కంపెనీ ఫ్రాన్స్ అండ్ యూకే వంటి కొన్ని యూరోపియన్ దేశాలలో లైవ్ స్పొర్ట్స్ ప్రసారం చేయడానికి మెన్స్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP) టెన్నిస్ టూర్ హక్కులను పొందేందుకు కంపెనీ ప్రయత్నించింది.
కంపెనీ నెక్స్ట్ ప్రయత్నం విజయవంతమైతే నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్, కార్లోస్ అల్కరాజ్ వంటి ప్లేయర్స్ నెట్‌ఫ్లిక్స్ స్క్రీన్‌పై కనిపిస్తారు. WSJ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA), అలాగే సైక్లింగ్ ఈవెంట్‌లతో సహా ఇతర స్పొర్ట్స్ ఈవెంట్‌లను కూడా ప్రయత్నిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ "ప్రొఫైల్ లీగ్" ని కొనుగోలు చేయడం గురించి చర్చ జరుగుతోంది.
undefined
ఇండియాలో, ఇంగ్లండ్ టాప్-టైర్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్, భారత క్రికెట్ జట్టు మ్యాచ్‌లతో పాటు జ్యువెల్ ఆఫ్ ది క్రౌన్ డిస్నీ+ హాట్‌స్టార్ యాజమాన్యంలో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని viacom18కి చెందినది.
నెట్‌ఫ్లిక్స్ నిరంతర నష్టంతో ఇబ్బంది పడి, కొన్ని నెలల క్రితమే గేమింగ్ సర్వీస్‌ను పరిచయం చేసింది. అయితే గేమ్ కోసం కస్టమర్‌లకు ప్రత్యేకంగా ఛార్జీ విధించదు. గేమింగ్ సర్వీస్ Netflix సబ్‌స్క్రిప్షన్‌లో మాత్రమే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సమయంలో ఏ యూజర్‌కు ఎలాంటి యాడ్స్ చూపదని తెలిపింది.