ఇండియాలోకి టిక్‌టాక్ లాంటి మరో షార్ట్ వీడియో యాప్ వచ్చేసింది.. ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్ కి పోటీగా లాంచ్..

By S Ashok Kumar  |  First Published Mar 17, 2021, 7:23 PM IST

గత ఏడాది భారతదేశంలో బ్యాన్ చేసిన టిక్‌టాక్ యాప్ ని స్పాట్‌లైట్ భర్తీ చేస్తుందని తెలిపింది. భారతదేశంతో పాటు బ్రెజిల్, మెక్సికోలోని వినియోగదారులకు కూడా స్పాట్‌లైట్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 


సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్  ఒక కొత్త షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ స్పాట్‌లైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది భారతదేశంలో బ్యాన్ చేసిన టిక్‌టాక్ యాప్ ని స్పాట్‌లైట్ భర్తీ చేస్తుందని తెలిపింది. భారతదేశంతో పాటు బ్రెజిల్, మెక్సికోలోని వినియోగదారులకు కూడా స్పాట్‌లైట్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పాట్‌లైట్ ఇప్పటికే యుఎస్ తో పాటు ఇతర 10 దేశాలలో అందుబాటులో ఉంది.


ఒక నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరిలో స్నాప్‌చాట్  చెందిన స్పాట్‌లైట్ వినియోగదారుల సంఖ్య 100 మిలియన్లు. స్నాప్‌చాట్  స్పాట్‌లైట్ లోని ఫీచర్ ద్వారా వినియోగదారులు టిక్‌టాక్ వంటి 60 సెకన్ల చిన్న వీడియోను క్రియేట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఇతర చిన్న వీడియో యాప్ లతో పాటు స్నాప్‌చాట్  స్పాట్‌లైట్ టిక్‌టాక్‌తో పోటీపడుతుంది.

Latest Videos

undefined

also read 

ఒక నివేదిక ప్రకారం, భారతీయ వినియోగదారులు కూడా స్పాట్‌లైట్ యాప్ నుండి డబ్బు సంపాదించవచ్చని స్నాప్‌చాట్ తెలిపింది. దీని కోసం, కంపెనీకి రోజుకు ఒక మిలియన్ డాలర్ల ఫండ్ ఉంది, అయితే స్పాట్‌లైట్ నిబంధన ఏమిటంటే స్పాట్‌లైట్ వినియోగించడానికి వినియోగదారులు కనీసం 16 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే వారి తల్లిదండ్రులు స్పాట్‌లైట్ ద్వారా డబ్బు సంపాదించడానికి   అనుమతించాలి.

భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తరువాత స్పార్క్, ఎంఎక్స్ తకాటక్, మోజ్ వంటి  స్థానిక షార్ట్ వీడియో యాప్‌లను  అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ అనే ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఫేస్‌బుక్ కూడా షార్ట్ వీడియో ఫీచర్‌ను విడుదల చేసింది.
 

click me!