60ఎం‌పి సెల్ఫీ కెమెరాతో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్.. షియోమీ, వివోకి పోటీగా పవర్ ఫుల్ ఫీచర్లు..

By asianet news telugu  |  First Published Dec 20, 2022, 8:43 PM IST

ఈ మోటో ఎక్స్40 ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లేతో 165 Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే  ఉంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోల కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్40ని లాంచ్ చేసింది.  అయితే మోటో ఎక్స్40  మోటో ఎక్స్30కి సక్సెసర్‌ మోడల్. ఈ మోటో ఎక్స్40 ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లేతో 165 Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే  ఉంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఫోన్‌తో 12జి‌బి ర్యామ్, 512 జి‌బి వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మోటో ఎక్స్40 షియోమీ 13, ఐ‌కు 11, వివో ఎక్స్90 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

మోటో ఎక్స్40 ధర
మోటో X40 స్మోకీ బ్లాక్, టూర్మలైన్ బ్లూ కలర్‌లో పరిచయం చేసారు. ఈ ఫోన్ నాలుగు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 128జి‌బి స్టోరేజ్‌తో 8 జి‌బి ర్యామ్ ధర $487 అంటే సుమారు రూ. 40,318. 256జి‌బి స్టోరేజ్‌తో 8 జి‌బి ర్యామ్ ధర $ 530 అంటే సుమారు రూ. 43,875. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర $ 573 అంటే సుమారు రూ. 47,435, 12 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్ ధర $ 617 అంటే సుమారు రూ. 51,000.

Latest Videos

undefined

మోటో ఎక్స్ 40 స్పెసిఫికేషన్‌లు
మోటో ఎక్స్40కి 6.7-అంగుళాల గుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్  డిస్ప్లేతో లభిస్తుంది. గరిష్టంగా 12జి‌బి వరకు LPPDR5x ర్యామ్, 512జి‌బి వరకు UFS 4.0 స్టోరేజీ,  స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ , అండ్రాయిడ్  13  MyUI 5.0 ఫోన్‌కు సపోర్ట్ చేస్తుంది. 

మోటో ఎక్స్ 40 కెమెరా
ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే   ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా  ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ ఉంది. 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. Moto X40లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాతో 4కె వీడియోను కూడా రికార్డ్ చేయవచ్చు. 

బ్యాటరీ
Moto X40 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4,600mAh బ్యాటరీ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం,  డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi, బ్లూటూత్, NFC అండ్ USB టైప్-సి పోర్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది.

click me!