200ఎం‌పి కెమెరా, 180W ఛార్జింగ్ తో కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..

By asianet news telugu  |  First Published Dec 20, 2022, 8:13 PM IST

ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 180 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పరిచయం చేసారు. అయితే కేవలం 12 నిమిషాల్లో ఈ ఫోన్  ఫుల్ ఛార్జ్ అవుతుందని క్లెయిమ్ చేయబడింది. 


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇండియాలో  కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జిని విడుదల చేసింది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 180 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పరిచయం చేసారు. అయితే కేవలం 12 నిమిషాల్లో ఈ ఫోన్  ఫుల్ ఛార్జ్ అవుతుందని క్లెయిమ్ చేయబడింది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జిలో 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ సపోర్ట్‌ ఉంది ఇంకా ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి..

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G ధర
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి రెండు కలర్స్ కాస్లైట్ సిల్వర్ ఇంకా జెనెసిస్ నోయిర్‌లో ప్రవేశపెట్టారు.  అయితే ఫోన్ సింగిల్ స్టోరేజ్‌లో వస్తుంది, 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర రూ.29,999. డిసెంబర్ 25 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో $520 (సుమారు రూ. 42,400)కి లాంచ్ చేయబడింది.

Latest Videos

undefined

స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్  స్పెసిఫికేషన్లు చూస్తే 6.8-అంగుళాల హెచ్‌డి ప్లస్ 3D కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 1,000 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో  ఇచ్చారు. ఫోన్ 6ఎన్‌ఎం ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్ 256 జి‌బి స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ ని వర్చువల్‌గా 13జి‌బి వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 2టి‌బి వరకు పొడిగించవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత XOS 12 ఫోన్‌లో ఇచ్చారు.

కెమెరా 
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది, ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీనితో పాటు  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ ఉంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్స్ ఇంకా మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

 బ్యాటరీ
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో GPS, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్, Wi-Fi 6 అండ్ 5Gకి  సపోర్ట్ ఉంది. ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 

click me!