కాంపాక్ట్ డిజైన్‌తో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్‌.. నీటిలో పడిన కూడా చెడిపోదు, ధర ఎంతో తెలుసా..

By asianet news teluguFirst Published Nov 22, 2022, 7:22 PM IST
Highlights

ఈ స్యామ్సంగ్ ఫోన్ బ్లాక్, వైట్  అండ్ రెడ్ కలర్స్ లో ప్రవేశపెట్టారు. 4జి‌బి ర్యామ్ తో 64 స్టోరేజ్ ధర 32,800 జపనీస్ యెన్ అంటే దాదాపు రూ.19,000ల ధరతో పరిచయం చేసారు.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్యామ్సంగ్ కొత్త 5జి ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జిని ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ని ఆగస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. అయితే స్యామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జిని మొదట జపాన్‌లో కాంపాక్ట్ డిజైన్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ 5.8-అంగుళాల TFT LCD డిస్ ప్లే, MediaTek Dimensity 700 ప్రాసెసర్‌తో 64జి‌బి స్టోరేజీ, 4జి‌బి ర్యామ్ ఈ ఫోన్ పొందుతుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ కూడా లభించింది.

 ధర 
ఈ స్యామ్సంగ్ ఫోన్ బ్లాక్, వైట్  అండ్ రెడ్ కలర్స్ లో ప్రవేశపెట్టారు. 4జి‌బి ర్యామ్ తో 64 స్టోరేజ్ ధర 32,800 జపనీస్ యెన్ అంటే దాదాపు రూ.19,000ల ధరతో పరిచయం చేసారు. అయితే స్యామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జి గ్లోబల్ వేరియంట్ ని 6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌లో కూడా ప్రవేశపెట్టారు, దీని ధర 9990 తైవాన్ డాలర్లు అంటే దాదాపు రూ. 26,437. 

స్పెసిఫికేషన్లు
స్యామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జిని ఆండ్రాయిడ్ 12 ఆధారిత OneUI 4.1తో పరిచయం చేసారు. ఫోన్ 5.8-అంగుళాల HD ప్లస్ TFT LCD డిస్‌ప్లే, 1560 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 700 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో ఫోన్ స్టోరేజ్ కూడా పెంచుకోవచ్చు. ఫోన్‌లో సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.  

కెమెరా 
స్యామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జి సింగిల్ బ్యాక్ కెమెరా సెటప్‌  పొందుతుంది, దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

బ్యాటరీ లైఫ్
ఈ Samsung ఫోన్ కోసం 4,000mAh బ్యాటరీ అందించారు, ఇంకా 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ ఇతర కనెక్టివిటీ గురించి మాట్లాడినట్లయితే 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, USB టైప్-C పోర్ట్, 3.5mm జాక్ ఉంది. ఫోన్‌తో పాటు E-SIM సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ బరువు 168 గ్రాములు. 

click me!