ఒక్క మెసేజ్ ద్వారా మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి

By asianet news teluguFirst Published Sep 13, 2022, 4:28 PM IST
Highlights

ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ ప్రారంభించింది. ఇప్పుడు కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మెసేజ్ పంపడం ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ చెక్ చేయవచ్చు.

  టోల్ ప్లాజాల వద్ద టోల్ చార్జ్ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. ఇప్పుడు టోల్ చార్జ్ చెల్లించడం చాలా సింపుల్ అది కూడా తక్కువ సమయంలోనే.  చాలా మంది ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ తక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతుంటారు.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఒక్క మెసేజ్ ద్వారా మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఎస్‌బి‌ఐ కొత్త ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్  ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఈ విధానాన్ని అనుసరించాలి. 

ఎస్‌ఎం‌ఎస్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా
స్టెప్ 1: మెసేజ్ బాక్స్ లో FTBAL అని టైప్ చేయండి. 
స్టెప్ 2: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి పైన పేర్కొన్న మెసేజ్ 7208820019కి ఎస్‌ఎం‌ఎస్ పంపండి. 
స్టెప్ 3: మీ బ్యాంక్ వెంటనే మీ SBI ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని తెలియజేస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్
ఫాస్ట్‌ట్యాగ్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణీకుల ఫాస్ట్ ట్యాగ్ అక్కౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తారు. ఫాస్ట్‌ట్యాగ్  డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయడం. మీ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్ (RFID ట్యాగ్) నుండి టోల్ చార్జ్ వసూలు చేయబడుతుంది. 

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) 1989 ప్రకారం రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ 1 జనవరి 2021 నుండి ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసింది. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఏదైనా బ్యాంకు ద్వారా చేయవచ్చు. SBI అక్కౌంట్ ఉన్న వ్యక్తికి ఫాస్ట్‌ట్యాగ్ అవసరమైతే, అతను బ్యాంక్  పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ (PoS) వద్ద దరఖాస్తు చేసుకోవాలి. SBI FASTag అక్కౌంట్ వాలిడిటీ 5 సంవత్సరాలు.

click me!