పెట్రోల్ ఆదా చేయండి ఇంకా మైలేజీ పెంచండి; గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌..

By Ashok kumar Sandra  |  First Published Dec 19, 2023, 2:36 PM IST

US, కెనడా ఇంకా యూరప్‌లోని వినియోగదారుల కోసం సేవ్ ఫ్యూయల్ ఫీచర్ సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు.  ఇప్పుడు భారతదేశంలో కూడా  ప్రవేశపెడుతోంది.


గూగుల్ మ్యాప్స్ టెక్ ప్రపంచంలో ఒక విప్లవం, ఇంకా అడ్రస్ కోసం  రూట్ ఎలా అని అడిగే విధానాన్ని బ్రేక్  చేసింది. మీరు ఏ అర్ధరాత్రి అయినా ఎక్కడికైనా వెళ్లవచ్చు. కానీ కొన్నిసార్లు ఒక్కో సంభార్భాల్లో  చేదు అనుభవాలు కూడా ఎదురుకావొచ్చు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో కొత్త అప్‌డేట్ ఉంది. ఆ ఫీచర్ పేరు 'సేవ్ ఫ్యూయల్'. పేరు సూచించినట్లుగా ఈ ఫీచర్ వాహనం ఇంధనాన్ని అదా   చేయడానికి  సహాయపడుతుంది. 

Latest Videos

US, కెనడా ఇంకా యూరప్‌లోని వినియోగదారుల కోసం సేవ్ ఫ్యూయల్ ఫీచర్ సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు.  ఇప్పుడు భారతదేశంలో కూడా  ప్రవేశపెడుతోంది. సేవ్ ఫ్యూయల్ ఫీచర్ యాక్టివేట్ చేసినప్పుడు, మ్యాప్ మనం సెలెక్ట్ చేసుకునే వివిధ మార్గాల్లో ఇంధనం లేదా బ్యాటరీ వినియోగాన్ని లెక్కిస్తుంది. రియల్-టైం ట్రాఫిక్ అప్‌డేట్‌లు ఇంకా రోడ్డు పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు  ఈ ఫీచర్ ద్వారా ఇంధనాన్ని సేవ్ చేసే రూట్‌లను తెలుసుకోవచ్చు.

Google మ్యాప్స్‌ని తెరిచి మీ ప్రొఫైల్ సింబల్ పై నొక్కండి, ఆపై సెట్టింగ్‌లలో నావిగేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. "రూట్ అప్షన్స్" లో ఇంధన సామర్థ్య మార్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. సూచనలను మెరుగుపరచడానికి మీ వాహనం  ఇంజిన్ పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్  అనే విషయాన్నీ పేర్కొనండి. ఈ ఫీచర్‌లో మీ  వాహనంలో ఉపయోగించిన ఇంధనం గురించి ఇన్‌పుట్ ఇంకా ఇతర సమాచారాన్ని పొందే అప్షన్ కూడా  ఉంది. దీనిని మీరు కావాలనుకుంటే ఉపయోగించవచ్చు. పెట్రోలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల, Google పెట్రోల్‌ను డిఫాల్ట్ ఇంజిన్ అప్షన్ గా సెట్ చేసింది.
 

click me!