స్మార్ట్‌ఫోన్ల ధరను భారీగా తగ్గించిన శాంసంగ్ ! ఇప్పడు 10వేల వరకు..

By Ashok kumar Sandra  |  First Published Feb 10, 2024, 1:33 PM IST

ఈ సందర్భంగా  గత సంవత్సరం విడుదలైన Galaxy S23 స్మార్ట్‌ఫోన్ సిరీస్ మొబైల్‌ల ధరలను తగ్గించింది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.10,000 తగ్గింది.
 


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Samsung  నెక్స్ట్ జనరేషన్  గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి ముందు గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్ సిరీస్ జనవరి 17న విడుదలవుతుందని కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా  గత సంవత్సరం విడుదలైన Galaxy S23 స్మార్ట్‌ఫోన్ సిరీస్ మొబైల్‌ల ధరలను తగ్గించింది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.10,000 తగ్గింది.

Latest Videos

దీనితో పాటు 10,000 రూపాయల ఇన్స్టంట్  బ్యాంక్ తగ్గింపును కూడా అందిస్తుంది. అంటే కస్టమర్లు Galaxy S23, Galaxy S23+ ఇంకా Galaxy S23 Ultraపై రూ. 20,000 తగ్గింపును పొందవచ్చు.

శాంసంగ్ ఇ-స్టోర్ అండ్ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ తగ్గింపు ధరతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చని కూడా సమాచారం.

8జిబి ర్యామ్,  128జిబి స్టోరేజీతో Galaxy S23 ధర రూ.74,999 నుండి రూ.64,999కి తగ్గించబడింది. రూ.10,000 తగ్గింపు తర్వాత మీరు దానిని రూ.54999 ధరతో కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్, 256జిబి మెమరీ  ఉన్న Galaxy S23 మొబైల్ ధర రూ.79,999 ఇప్పుడు రూ.69,999కి తగ్గించారు. అంతే కూడా రూ.10,000 తగ్గింపుతో రూ.59,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

8జిబి ర్యామ్,   128GB స్టోరేజ్ గల Galaxy S23+ ధర రూ.94,999 నుండి రూ.84,999కి తగ్గించబడింది. అలాగే రూ.10,000 తగ్గింపు తర్వాత రూ.74999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Galaxy S23+ మొబైల్ 8జిబి ర్యామ్ అండ్  512GB స్టోరేజ్ ధర రూ.1,04,999 ఇప్పుడు రూ.94,999కి తగ్గించారు. ఇది కూడా రూ.10,000 తగ్గింపుతో రూ.89,499 వద్ద కొనుగోలు చేయవచ్చు.

click me!