అంచెలంచెలుగా ఎదిగి..! Paytm షేర్లు ఢమాల్.. 2 రోజుల్లో 40% ఫట్..

By Ashok kumar Sandra  |  First Published Feb 9, 2024, 1:02 PM IST

Paytm షేర్లు 20% పడిపోయి రూ. 487.20గా ఉంది. దింతో రెండు ట్రేడింగ్ సెషన్లలో 40 శాతం క్షీణతను సూచిస్తుంది. 
 


Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండో రోజు 20 శాతం పడిపోయాయి. ఈరోజు శుక్రవారం ట్రేడింగ్‌లో మరింత పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో పేటీఎం షేర్లు 20 శాతం పడిపోయి రూ.487.20కి చేరుకున్నాయి.

దీంతో పేటీఎం షేర్లు 52 వారాల కనిష్టానికి చేరి రెండు ట్రేడింగ్ సెషన్లలో 40 శాతం పడిపోయాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్య వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించగలమని Paytm చెబుతుండగా, ఈ చర్య Paytm కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

ఇంతకుముందు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, Paytm  భాగస్వామ్యం Paytm payments bankకి   వ్యతిరేకంగా RBI   చర్య ఫలితంగా వరస్ట్-కేస్ అన్యువల్ EBITDAలో  రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల నష్టం వాటిల్లవచ్చని సూచించింది. Paytm వ్యవస్థాపకుడు అండ్  CEO అయిన విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, ఈ చర్య "హై స్పీడ్ బంప్" ఇంకా  "మేము దీనిని రాబోయే కొద్ది రోజుల్లో చూడగలం" అని అన్నారు.

"ఫిబ్రవరి 29 తర్వాత యథావిధిగా వ్యాపారం అవుతుంది" అని ఆయన ఈరోజు X సైట్‌లో ఒక పోస్ట్‌లో హామీ ఇచ్చారు. Paytm ద్వారా హామీలు, నష్ట నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ, Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI చర్య   ప్రభావాన్ని చూపుతూ చాలా మంది విశ్లేషకులు స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేశారు.

click me!