స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామి కంపెనీ అయిన శామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామి కంపెనీ అయిన శామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. శామ్‌సంగ్ అందిస్తున్న గెలాక్సీ ఆన్ సిరీస్‌తో Samsung Galaxy On6 పేరిట ఓ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఫీచర్‌తో వచ్చిన ఈ ఫోన్ గతంలో విడుదలైన పాత తరం ఆన్6 కంటే 15 శాతం అదనపు స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఆన్6 5.6 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో, 720×1480 పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఈ ఫోన్‌లో ఈక్సినాస్ 7870 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో లభిస్తుంది. మెమరీ కార్డు ఫోన్ స్టోరేజీని అదనంగా 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
undefined
ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కలిగిన కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కలిగిన కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 3000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో లభిస్తుంది. 4జీ వోల్ట్, వైఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యూఎస్‌బి, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి ఫీచర్లు దీని సొంతం.
శామ్‌సంగ్ ఆన్‌లైన్ షాప్ మరియు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ల ద్వారా గెలాక్సీ ఆన్6 పోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో దీని ధర రూ.14,490 గా ఉంది. జులై 5వ తేదీ నుండి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మార్కెట్లో ఈ సెగ్మెంట్లో లభిస్తున్న రెడ్‌మి నోట్ 5 ప్రో, రియల్‌మి 1 వంటి స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.