శామ్ సంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

First Published 3, Jul 2018, 1:04 PM IST
Highlights

ఫీచర్లు అదిరిపోయాయి

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శామ్ సంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. గెలాక్సీ ఆన్6 పేరిట ఈ ఫోన్ ని ఆన్ లైన్ లో విడుదల చేసింది. జులై5వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఎక్సక్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్, శామ్ సంగ్ ఆన్ లైన్ స్టోర్స్ లో  లభ్యం కానుంది. 
 
ఈ ఫోన్ ధర రూ.14,490గా కంపెనీ ప్రకటించింది. 18:5:9  ఆస్పెక్ట్ రేషియో, ఇన్ఫినిటీ డిస్ ప్లేతో గతంలో కంటే 15 శాతం అదనంగా స్క్రీన్ డిస్‌ప్లే పరిమాణం ఈ ఫోన్లో లభిస్తుంది. చాలా పలుచని అంచులు ఈ ఫోన్లో ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రెడ్ మీ నోట్ 5 ప్రో, రియల్ మీ 1 ఫోన్లకి గట్టి పోటీ ఇచ్చేలా ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. 

శామ్ సంగ్ గెలాక్సీ ఆన్6 ఫోన్ ఫీచర్లు..

5.60 ఇంచెస్ డిస్ ప్లే
1.6జీ హెచ్ జెడ్ ఆక్టాకోర్ ప్రెసెసర్
720*480 పిక్సెల్స్ రెజల్యూషన్
4జీబీ ర్యామ్
32జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా
13మెగా పిక్సెల్ వెనక కెమేరా
ఆండ్రాయిడ్ 8 ఆపరేటింగ్ సిస్టమ్
3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Last Updated 3, Jul 2018, 1:04 PM IST