రెడ్‌మిని తలదన్నే స్మార్ట్ ఫోన్ ఇదేనా?

First Published 30, Jun 2018, 2:17 PM IST
Highlights

రెడ్‌మి ని తలదన్నేలా కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫో విజన్ 3 ప్రో  ధర కేవలం రూ.10,999 మాత్రమే.

రెడ్‌మి ని తలదన్నేలా కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫో విజన్ 3 ప్రో ధర కేవలం రూ.10,999 మాత్రమే. వెనుకవైపు 13 మెగా ఫిక్సెల్ + 8 మెగా ఫిక్సెల్ డ్యుయల్ కెమెరా 

గత సంవత్సరం విజన్ 3 వెర్షన్‌తో మార్కెట్లోకి వచ్చి సంచలనం కలిగించిన ఇన్ఫోకస్ విజన్ 3 స్మార్ట్ ఫోన్ అనతి కాలంలోనే రెడ్‌మి 5, రెడ్‌మి నోట్ 5, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 లాంటి అధునాతన స్మార్ట్ ఫోన్ల రాకతో కాస్త ప్రాభవం తగ్గింది. పోటీలో వెనుకబడకూడదనే లక్ష్యంతో 2018లో ఇన్ఫోకస్ విజన్ 3 ప్రో వెర్షన్ వచ్చేసింది. మధ్యభాగంలో మెటల్ బ్యాక్ ప్లేట్‌తో చూడగానే ప్రీమియం ఫోన్ అనిపించేలా ఆకర్షణీయంగా ఉంది. 5.7 అంగుళాల డిస్‌ప్లేత్ చక్కటి కలర్ రీప్రొడక్షన్, వ్యూయింగ్ యాంగిల్స్‌తో మార్కెట్లో మంచి పోటీనిస్తోంది. 

ప్రత్యేకతలు
ప్రాసెసల్  మీడియాటెక్ ఎమ్‌టి6750. ఎ53 కోర్స్‌తో కూడిన టూ క్లస్టర్ అక్టా కోర్ ప్రాసెసర్.
రామ్ - 4 జీబీ
స్టోరేజ్ 64 జీబీ
ఎక్స్‌పాండబుల్ - 128 జీబీ
రెండు సిమ్ లలోనూ 4జి మరియు వోల్టేని సపోర్టు చేస్తుంది.

ఇతర ప్రత్యేకాంశాలు
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
వీడియో రికార్డింగ్ కెపాసిటీ 1080 పిక్సెల్ ముందు వెనుక కెమెరాలతో
13 మెగా ఫిక్సెల్ సెల్ఫీ కెమెరా చక్కటి ఫోటోలు తీస్తుంది. 
బ్యూటీ మోడ్ డిపాల్ట్‌గా ఎనేబుల్ చేయబడింది. 
సెల్ఫీని జూమ్ చేసి చూడవచ్చు. సోషల్ మీడియా యాప్స్‌తో దీన్ని షేర్ చేసేంత స్పష్టంగా ఉంటుంది.

ఇన్‌ఫోకస్ విజన్ 3 ప్రో అనేది ఇన్ ఫోకస్ విజన్ 3కి అప్ గ్రేడెడ్ వెర్షన్. శక్తివంతమైన ప్రాసెసర్, మరింత రామ్. అధిక స్టోరేజ్ సామర్థ్యం. తక్కువ బడ్జెట్లోడ ఇది పోటీ బాగానే ఇస్తుందనుకున్నతలోనే రెడ్‌మి 5, రెడ్‌మి నోట్ 5, ధర తగ్గింపుతో పోటీకి వచ్చేశాయి. ఇటీవలే లాంచ్ చేసిన అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 కూడా రూ. 10,999కే లభిస్తోంది. ఈ ఫోన్‌తో పోలిస్తే ఇన్‌ఫోకస్ విజన్ 3 ప్రో కాస్త తక్కువ పీచర్లే ఉన్నాయి. 

మొత్తం మీద చూస్తే గత సంవత్సరం 15 వేలకుపైగా పలికిన హైఎండ్ స్మార్ట్ ఫోన్లు 2018 ప్రారంభానికి బడ్జెట్ ఫోన్లుగా మారిపోవడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి కావడంతో ఇతర బ్రాండ్‌లతో పాటు ఇన్ ఫోకస్ విజన్ 3 ప్రో చక్కగానే పోటీ పడుతుందని చెప్పవచ్చు. పైగా రెడ్ మీ ప్రత్యేకతలతో దాదాపు సమాన స్థాయి పొందటం మరీ విశేషం.

Last Updated 30, Jun 2018, 2:17 PM IST