టార్గెట్ యూత్.. 27న మార్కెట్‌లోకి శామ్‌సంగ్ ‘ఎం30’

By Siva KodatiFirst Published Feb 17, 2019, 1:29 PM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీని ఢీకొట్టేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ దూకుడుగా ముందుకు వెళుతోంది. గతనెలలో ఎం 10, ఎం 20 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన శామ్ సంగ్.. తాజాగా ఈ నెల 27వ తేదీన భారత విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

భారత‌ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే శాంసంగ్‌ ఎం10, ఎం20 పేరుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా, త్వరలో ఇదే సిరీస్‌లో ‘ఎం30’ పేరుతో మరో మోడల్‌ స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ ‌ప్రియుల కోసం తీసుకురానున్నది.

ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు భారత్ మార్కెట్లోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 ఫోన్ ఆవిష్కరించనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. వచ్చేనెల మొదటి వారం నుంచి అమ్మకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకే శామ్‌సంగ్‌ ఈ ఫోన్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. రేర్ ట్రిపుల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, రూ.15 వేల ప్రారంభ ధరతో ఎం30ని తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంటున్నారు.

సూపర్‌ ఆమ్లాయిడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌+ 128 జీబీ మెమొరీ వేరియంట్లలో ఈ ఫోన్‌ రావచ్చొని సమాచారం. ఇక కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 13+5+5ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉండగా, ముందు వైపు 16మెగా పిక్సెల్‌ కెమెరాను అమర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరి ఎలాంటి ఫీచర్లతో శాంసంగ్‌ ఈఫోన్‌ తీసుకొస్తుందో చూడాలి. అయితే శామ్ సంగ్ సంస్థ ఎం30 మోడల్ ఫోన్ డిజైన్ గురించి గానీ, ఆవిష్కరణ గురించి గానీ దాచిపెట్లేదు.అయితే గేలాక్సీ ఎం 30 మోడల్ ఫోన్ రేర్ ప్యానెల్ మెటల్ తో ఉంటుందా? ప్లాస్టిక్ తో తయారు చేశారా? అన్న విషయం బయటపడలేదు.

టెలిఫోన్స్ లెన్స్ 3ఎక్స్ జూమ్ అవుతుంది. టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్, ఎక్సినోస్ 79054 చిప్ సెట్ పవర్ కలిగి ఉంటుంది. రేర్ ట్రిపుల్ కెమెరాతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న శామ్ సంగ్ గేలాక్సీ ఎం30 మోడల్ ఫోన్ అతి చౌక అని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది ఆవిష్కరించిన గేలాక్సీ ఏ7 ఫోన్ రూ.18,990లకే అందుబాటులో ఉంది. 

click me!