మైక్రోసాఫ్ట్ మీడియా స్టాఫ్‪కు షాక్: కృత్రిమ మేధతో జర్నలిజం విధులు!

By narsimha lode  |  First Published May 31, 2020, 2:43 PM IST

సాఫ్ట్​వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఎడిటోరియల్ సిబ్బందిని తొలగించనున్నది. వారి స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.
 


న్యూయార్క్: సాఫ్ట్​వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఎడిటోరియల్ సిబ్బందిని తొలగించనున్నది. వారి స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.

స్టాఫ్ ఏజెన్సీ అక్వెంట్​, ఐఎఫ్​జీ, మాక్​ కన్సల్టింగ్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సుమారు 50 మంది న్యూస్ ప్రొడక్షన్​ సిబ్బందిని జూన్​ 30 తరువాత తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఇకపై వీరి స్థానంలో ఏఐ అల్గారిథమ్​ని ఉపయోగించి సంపాదకీయాలను నిర్వహించనుంది 

Latest Videos

undefined

మైక్రోసాఫ్ట్ వార్తా విభాగం 'మైక్రోసాఫ్ట్​ న్యూస్'​. ఇది ఎంఎస్​ఎన్​.కామ్​ని నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వీటిలో పనిచేసే ఉద్యోగులనే తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. కరోనా సంక్షోభానికి... తాజాగా తాము తీసుకున్న నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. కేవలం సంస్థ అభివృద్ధి కోసమే తాజా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ప్రచురణ భాగస్వాముల నుంచి వచ్చే ట్రెండింగ్ వార్తలను గుర్తించడం, ముఖ్యమైన అంశాలను తిరిగి రాయడం, మెరుగైన చిత్రాలు, స్లైడ్ షోలను జోడించడం వంటి పనులను ఈ టీమ్ నిర్వహిస్తుంది.

ఈ విభాగంలో పని చేస్తున్న స్టాఫ్ ఒకరు మాట్లాడుతూ ‘నేను నా టైంలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తాయో చదివే వాడిని. అటువంటిది ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ ఉద్యోగాలు లాగేసుకుంటున్నదని, తన ఉద్యోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసేసుకున్నదని చెప్పారు. 

సదరు ఉద్యోగి కూడా మైక్రోసాఫ్ట్ సంస్థలో మానవుల స్థానే జర్నలిజం విధుల నిర్వహణకు సాఫ్ట్‌వేర్ వాడాలని సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగస్వామి. మైక్రోసాఫ్ట్ హోంపేజీ నిర్వహణ ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ హోం పేజీల్లో హింసాత్మక, అనుచిత సమాచారం. ప్రత్యేకించి యువతను ప్రేరేపించే సమాచారాన్ని రానివ్వకుండా చూడాలన్నది మైక్రోసాఫ్ట్ నిర్ణయం. 

మైక్రోసాఫ్ట్ నేరుగా వార్తలను రిపోర్ట్ చేయదు. ఇతర సంస్థల్లో వచ్చిన వార్తలను తన హౌస్ ఫార్మాట్‌కు అనుగుణంగా మార్చి సిబ్బందికి అందుబాటులో ఉంచుతుంది. ఈ వార్తలపై వచ్చే రెవెన్యూను సంబంధిత వార్తాసంస్థలతో మైక్రోసాఫ్ట్ పంచుకుంటుంది. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్ట కాలం నడుస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ వద్ద ఎడిటోరియల్ ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న వారు తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం ఒకింత కష్టంతో కూడుకున్న పనేనని అంటున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం మేరకు నియమించిన పీఏ మీడియా కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. కొందరు ఉద్యోగులను ఇంటికి పంపివేసి,, తర్వాత కొందరి వేతనాల్లో కోత విధించింది. 

మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ పీఏ మీడియాతో బంధం ముగించి వేసే ప్రక్రియలో ఉన్నామని, అయితే, తాము ప్రతి ఒక్కరి ఆందోళనకు మద్దతునిస్తామని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి అత్యున్నత సర్వీసుతో అందించిన సేవలకు గర్విస్తున్నామన్నారు. ప్రతి సంస్థ తన బిజినెస్ లావాదేవీలను ఎప్పటికప్పుడు మదింపు చేసి ఎక్కువ ఖర్చు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్త వారి నియామకంతో తగ్గింపుకు చర్యలు తీసుకుంటుందన్నారు. 

click me!