షాక్: టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం

By Siva KodatiFirst Published Feb 13, 2019, 8:19 AM IST
Highlights

ఈ మధ్యకాలంలో యువత బాగా కనెక్ట్ అయిన యాప్ ‘టిక్ టాక్’. చూడటానికి ఇది డబ్‌స్మాష్‌లానే ఉంటుంది. కానీ ఇందులో మ్యూజికల్ వీడియోస్ వుంటాయి. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని లోకానికి పరిచయం చేసే అవకాశం ఉండటతో యూత్ దీనికి ఫిదా అయ్యారు.

ఇటువంటి యాప్‌ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ హన్సారీ.. టిక్ టాక్ యాప్‌ను తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని కోరారు.

అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ సమాధానం ఇచ్చారు.. టిక్ టాక్ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. 

click me!