X (గతంలో ట్విటర్‌గా ఉండేది)లో బాలీవుడ్ హీరో అండ్ రియల్‌మీ బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ ఖాన్ చేతిలో బ్లూ షేడ్‌లో ఉన్న ఫోన్ ఫోటోని షేర్ చేసింది. లాస్‌లెస్ జూమ్ కోసం ఫోన్‌లో పెరిస్కోప్ లెన్స్‌ను కంపెనీ వాగ్దానం చేస్తోంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ రియల్ మి 12 సిరీస్ 5 జిని ఇండియాలో జనవరి 29 మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
X (గతంలో ట్విటర్‌గా ఉండేది)లో బాలీవుడ్ హీరో అండ్ రియల్‌మీ బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ ఖాన్ చేతిలో బ్లూ షేడ్‌లో ఉన్న ఫోన్ ఫోటోని షేర్ చేసింది. లాస్‌లెస్ జూమ్ కోసం ఫోన్‌లో పెరిస్కోప్ లెన్స్‌ను కంపెనీ వాగ్దానం చేస్తోంది. గతంలో అనేక లీక్‌లు హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లను టిప్ చేశాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి:
Realme 12 Pro, 12 Pro ప్లస్ స్పెసిఫికేషన్‌లు (అంచనా)
Realme 12 Pro అండ్ 12 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా సెంటర్-పంచ్ హోల్‌తో 6.7-అంగుళాల FHD+ కర్వ్డ్ OLED స్క్రీన్‌తో రావొచ్చు. 12 Pro స్నాప్‌డ్రాగన్ 6 Gen 1లో రన్ కావచ్చు ఇంకా 12 Pro+ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. Realme 12 Pro 5G సిరీస్ ఆప్టికల్ జూమ్ కోసం టెలిఫోటో సెన్సార్‌ను అందిస్తుంది.
రెండు ఫోన్‌లు 5,000mAh బ్యాటరీతో ఉండవచ్చు. ఆప్టిక్స్ విషయానికొస్తే, 12 ప్రోలో 50MP ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ + 32MP టెలిఫోటో ఇంకా 16MP సెల్ఫీ లెన్స్ ఉండవచ్చు. అలాగే 50MP OIS ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ + 64MP పెరిస్కోప్ వెనుక అండ్ 32MP సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. సెక్యూరిట్య్ కోసం ఫోన్‌లకి ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి.
Realme 12 Pro, 12 Pro ప్లస్ ధర (అంచనా)
Realme 12 Pro+ గతం కంటే ఎక్కువ ధరతో ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి, దీని అంచనా ప్రారంభ ధర రూ. 30,000 కంటే ఎక్కువగా ఉండొచ్చు, దీని టాప్ మోడల్ విషయంలో రూ. 35,000 దాకా ఉండొచ్చు (బహుశా 12GB + 512GB). లీకైన ఛానెల్‌ల ద్వారా 12 ప్రో ధర గురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. 12 ప్రో లేత గోధుమరంగు ఇంకా సబ్‌మెరైన్ బ్లూ షేడ్స్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, 12 ప్రో+ లేత గోధుమరంగు, సబ్‌మెరైన్ బ్లూ ఇంకా ఎక్స్‌ప్లోరర్ రెడ్‌లో రావచ్చు.