ఆపిల్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కి షాకింగ్.. త్వరలో ఈ కారణంగా ఐఫోన్ పాత సిరీస్ నిలిపివేయవచ్చు...

By asianet news telugu  |  First Published Apr 19, 2022, 1:41 PM IST

ఆపిల్ ఐఫోన్ 11 ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్‌ఈ 3తో పోటీగా ఉండటంతో త్వరలోనే  ఐఫోన్ 11ని నిలిపివేయనుంది. భారతదేశంలో ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 49,900 కాగా, ఐఫోన్ ఎస్‌ఈ 3 లేదా ఐఫోన్ ఎస్‌ఈ 2022 ధర రూ. 43,900


న్యూఢిల్లీ: ఆపిల్ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేయనుంది. అయితే ఇప్పుడు 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్‌ను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఒక నివేదిక ప్రకారం, ఐఫోన్ 11 వయస్సు, ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ SE 3తో నేరుగా పోటీపడటం వలన దానిని దశలవారీగా నిలిపివేయనుంది. భారతదేశంలో ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 49,900 కాగా, ఐఫోన్ SE 3 లేదా ఐఫోన్ SE 2022 ధర రూ. 43,900 నుండి ప్రారంభమవుతుంది.

 నివేదిక ప్రకారం, ఆపిల్ 2020లో విడుదల చేసిన iPhone 12 సిరీస్ ధరను కూడా తగ్గించవచ్చు. భారతదేశంలో ఈ సిరీస్ రూ. 65,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 12 ప్రస్తుత ధర $999 (రూ. 76,170) నుండి $599 (సుమారు రూ. 45,672)కి తగ్గించబడుతుందని భావిస్తున్నారు. ఈ నివేదిక నిజమైతే iPhone 12 ధర iPhone 11కి సమానంగా ఉండవచ్చు. నివేదిక ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ మరికొన్ని సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Latest Videos

undefined

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 14 ప్రో 6.1-అంగుళాల డిస్‌ప్లేతో అండ్  ఐఫోన్ 14 ప్లస్ ఇంకా ఐఫోన్ ప్రో మాక్స్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో  ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా Qualcomm A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని, 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం iPhone 14 Plus, iPhone 14 Max లు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌లతో LTPO ప్యానెల్‌ ఉంటాయని భావిస్తున్నారు.

కెమెరాల విషయానికొస్తే, సిరీస్ టాప్ ప్లస్ అండ్ మాక్స్ ఎడిషన్‌లు 48MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌ ఉంటాయని భావిస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 13 సిరీస్ కంటే పెద్ద బ్యాటరీ కూడా ఉంటుంది. నివేదికల ప్రకారం, కంపెనీ 2TB వెర్షన్‌లో సిరీస్ టాప్ వేరియంట్‌లను కూడా అందించవచ్చు. 

click me!