Amazing Technique:మెటావర్స్‌లో ముద్దుపెట్టుకోవడం, ఎవరినైనా ప్రత్యేకంగా భావించడం ఇప్పుడు ఈజీ..

Ashok Kumar   | Asianet News
Published : May 02, 2022, 12:29 PM IST
Amazing Technique:మెటావర్స్‌లో ముద్దుపెట్టుకోవడం, ఎవరినైనా ప్రత్యేకంగా భావించడం ఇప్పుడు ఈజీ..

సారాంశం

కొత్త టెక్నాలజి సహాయంతో ప్రజలు మెటావర్స్‌లో వారి భాగస్వామిని ముద్దుపెట్టుకోగలుగుతారు ఇంకా ఆ అనుభూతి కూడా చెందుతారు. నివేదిక ప్రకారం, మెటావర్స్‌లో మీరు మీ భాగస్వామి పెదవుల అనుభూతి చెందుతారు, మీరు ఆమె దగ్గర లేకపోయినా ముద్దుపెట్టుకోగలరు.

మెటా(Facebook)సి‌ఈ‌ఓ మార్క్ జూకర్ బెర్గ్ మెటావర్స్ అనౌన్స్ చేసి కంపెనీకి Meta అని పేరు పెట్టినప్పుడు, మెటావర్స్ (Metaverse) అంటే ఏమిటో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మెటావర్స్ లో పెళ్లిళ్లు, భూముల కొనుగోలు, సంగీత కచేరీలు  చేస్తున్నారు. 

ఇప్పుడు Metaverseకి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. కొత్త టెక్నాలజి సహాయంతో ప్రజలు తమ భాగస్వామిని ముద్దుపెట్టుకోగలుగుతారని ఇంకా మెటావర్స్‌లో ఆ అనుభూతి చెందుతారని చెబుతున్నారు. నివేదిక ప్రకారం, మెటావర్స్‌లో, మీరు మీ భాగస్వామి పెదవులను అనుభూతి చెందుతారు అలాగే మీరు ఆమె దగ్గర లేకపోయినా ముద్దుపెట్టుకోగలరు.

వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌లలో అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూసర్‌ల ద్వారా కొత్త టెక్నాలజి సాధ్యమైంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వీఆర్ హెడ్‌సెట్‌లో వైబ్రేషన్ ఉంటుందని, దీని ద్వారా భాగస్వామికి దగ్గరైన అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త టెక్నాలజి సహాయంతో, ప్రజలు మెటావర్స్‌లో వాటర్ తాగడం, టీ సిప్ చేయడం కూడా చేయగలుగుతారు. మెటావర్స్‌లో  సిగరెట్ తాగే అవకాశం కూడా ఉంటుంది.

పెన్సిల్వేనియాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త టెక్నాలజీతో సరికొత్త హెడ్‌సెట్‌ను రూపొందించారు. ఈ హెడ్‌సెట్‌కు ప్రత్యేక హాప్టిక్ (వైబ్రేషన్) టచ్ ఉంది. ఈ హాప్టిక్ సిస్టమ్ పెదవులు, దంతాలు, నాలుకపై ఉత్తమంగా పనిచేస్తుందని నివేదిక పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Snake Alert App : ప్రమాదకర పాముల జాడను గుర్తించే యాప్.. ఇది మొబైల్ ఉంటే మీరు సేఫ్
Samsung Galaxy M47 5G : భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ