రియల్‌మీ 10Sని స్ట్రీమర్ బ్లూ, క్రిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది, ఇందులో 8 జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ధర 1099 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 13,079.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ 10సిరీస్ ని విస్తరిస్తూ మరో కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 10ఎస్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదట దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసారు. రియల్‌మీ 10Sకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంది. ఇంకా 8జిబి ర్యామ్ తో 256జిబి వరకు స్టోరేజ్ ఉంది. తాజాగా రియల్‌మీ 10 ప్రొ ప్లస్, రియల్‌మీ 10 ప్రొని ఇండియాలో రియల్ మీ 10 సిరీస్ క్రింద తీసుకొచ్చారు.
రియల్‌మీ 10s ధర
రియల్‌మీ 10Sని స్ట్రీమర్ బ్లూ, క్రిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది, ఇందులో 8 జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ధర 1099 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 13,079. 8జిబి ర్యామ్ 256జిబి స్టోరేజ్ ధర 1299 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 15,397.
రియల్‌మీ 10s స్పెసిఫికేషన్లు
రియల్‌మీ 10S 6.6 అంగుళాల హెచ్‌డి ప్లస్ IPS ఎల్‌సిడి డిస్ ప్లే, డిస్‌ప్లే 1080 x 2408 పిక్సెల్ రిజల్యూషన్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, ఆండ్రాయిడ్ 12 రియాలిటీ UI 3.0, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీ పెంచుకోవచ్చు.
కెమెరా అండ్ బ్యాటరీ
ఫోన్ కెమెరా సపోర్ట్ గురించి మాట్లాడితే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఫోన్‌లో సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మీ 10S 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 802.1AC, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు.