మీ ఫోన్ లో 5జి నెట్‌వర్క్ ఉపయోగించాలనుకుంటున్నారా.. ఇలా యాక్టివేట్ చేయండి..

By asianet news teluguFirst Published Dec 17, 2022, 10:00 AM IST
Highlights

ఇండియాలోని ఐఫోన్ వినియోగదారులు 5G నెట్‌వర్క్‌  కవరేజ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G  సర్వీస్ బెనిఫిట్ పొందవచ్చని  కంపెనీ తాజాగా ప్రకటించింది. 2020లో లేదా ఆ తర్వాత లాంచ్ చేసిన అన్ని iPhoneలలో 5Gని ఉపయోగించవచ్చు

టెక్ కంపెనీ ఆపిల్ ఇండియాలో ఐ‌ఓ‌ఎస్ 16.2తో ఐఫోన్స్ కోసం 5జి నెట్‌వర్క్ సపోర్ట్ విడుదల చేసింది. జియో అండ్ ఎయిర్ టెల్ కనెక్షన్‌  ఉన్న ఐఫోన్ యూజర్లు డిసెంబర్ 13 నుండి 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. జియో ఐఫోన్ కోసం 5జి సర్వీస్ కూడా విడుదల చేసింది. జియో ఐఫోన్ 12 అండ్ అంతకంటే పై అన్ని మోడళ్లతో వెల్‌కమ్ ఆఫర్‌ల క్రింద ఉచిత ఆన్ లిమిటెడ్ డేటా బెనిఫిట్ ప్రకటించింది. 

  ఇండియాలోని ఐఫోన్ వినియోగదారులు 5G నెట్‌వర్క్‌  కవరేజ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G  సర్వీస్ బెనిఫిట్ పొందవచ్చని  కంపెనీ తాజాగా ప్రకటించింది. 2020లో లేదా ఆ తర్వాత లాంచ్ చేసిన అన్ని iPhoneలలో 5Gని ఉపయోగించవచ్చు. మీకు iPhone 12 లేదా అప్ డేట్ మోడల్ ఉంటే కూడా మీరు 5G సర్వీస్ సద్వినియోగం చేసుకోవచ్చు. 

ఈ ఐఫోన్లలో జియో ట్రూ 5జీ
హై స్పీడ్ నెట్‌వర్క్ అంటే 5G సేవను ఆపిల్ ఐఫోన్ 12 ఇంకా అన్ని అప్ డేట్ వేరియంట్‌లలో ఉపయోగించవచ్చు. ఈ డివైజెస్ లో ఐఫోన్ SE (2022), ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రొ  మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ Plus, ఐఫోన్ 14 ప్రొ ఉన్నాయి.

5G నెట్‌వర్క్‌ ఇలా యాక్టివేట్ చేయండి
మీరు జియో లేదా ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఇంకా మీ నగరం లేదా పట్టణంలో 5G అందుబాటులోకి వచ్చినట్లయితే, మీరు 5G సర్వీస్ ని ఉపయోగించవచ్చు. 5Gని ఎనేబుల్ చేయడానికి, మీరు మీ ఐఫోన్ యొక్క సెట్టింగ్‌లకు వెళ్లి, ఇక్కడ జనరల్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై నొక్కండి. మీ ఐఫోన్ కోసం iOS 16.2 అప్‌డేట్ విడుదల చేయబడితే, మీరు డౌన్‌లోడ్ అప్శాన్ చూస్తారు.

అన్ని నిబంధనలు అండ్ షరతులను చదివిన తర్వాత, మీ iPhoneలో అప్ డేట్ ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి. కొత్త అప్‌డేట్ తర్వాత, మీరు కొత్త 5G స్టేటస్ సింబల్ పొందుతారు. మీరు ఇప్పటికీ 5G స్టేటస్ చూడకపోతే, మీరు ఫోన్ సెట్టింగ్‌లలోని SIM సెట్టింగ్‌కి వెళ్లి 5G నెట్‌వర్క్‌ను ఎనేబుల్ చేయాలి. తర్వాత మీరు ఐఫోన్‌లో 5G ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. 

click me!