రియల్ మీ గోల్డెన్ ఫెస్టివల్ సేల్: స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్స్.. ఈ పవర్ ఫుల్ ఫోన్ తక్కువ ధరకే..

By asianet news telugu  |  First Published Dec 21, 2022, 3:48 PM IST

ఈ సెల్‌లో రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజెస్ పై గొప్ప డిస్కౌంట్స్ అందిస్తుంది. రియల్ మీ ఈ సెల్‌లో కస్టమర్లు అమెజాన్ ఇండియా ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుండి ఆఫర్స్ క్రింద స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. 


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ కస్టమర్‌ల కోసం క్రిస్మస్ గిఫ్ట్ తో వచ్చేసింది. రియల్ మీ డిసెంబర్ 20 నుండి రియల్ మీ గోల్డెన్ ఫెస్టివల్ సేల్‌  ప్రారంభించింది. ఈ సెల్‌లో రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజెస్ పై గొప్ప డిస్కౌంట్స్ అందిస్తుంది. రియల్ మీ ఈ సెల్‌లో కస్టమర్లు అమెజాన్ ఇండియా ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుండి ఆఫర్స్ క్రింద స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో రియల్ మీ సి30, రియల్ మీ 9 సిరీస్‌పై రూ. 4500 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి.

రియల్ మీ సి30పై ఆఫర్లు
తాజాగా లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను కేవలం రూ. 5,749కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో Unisoc T612 ప్రాసెసర్‌ అందించారు. ఫోన్‌లో 8ఎం‌పి ప్రైమరీ కెమెరా, 5ఎం‌పి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ ఇంకా 32జి‌బి  స్టోరేజ్ ఫోన్‌లో  అందించారు.

Latest Videos

రియల్ మీ 9 సిరీస్‌లో ఆఫర్‌లు
ఈ సేల్ సమయంలో రియల్ మీ 9 6జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు.  రియల్ మీ 9 5జి SEని రూ. 17,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌తో పాటు 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంది. రియల్ మీ 9 5జి  SE Android 11 బేస్డ్ Realme UI 2.0ని పొందుతుంది. 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌ ఉంది. ఫోన్‌లో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఇంకా దీనితో పాటు 5000mAh బ్యాటరీ అలాగే 18W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు
రియల్ మీ తాజాగా లాంచ్ చేసిన రియల్ మీ 10 ప్రొ సిరీస్‌ను సెల్ సమయంలో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్ మీ సి33 3జి‌బి ర్యామ్‌తో 32జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 8,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ నార్జో 50i ప్రైమ్, రియల్ మీ నార్జో 50iలను కూడా 8 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 

ఈ డిబైజెస్ పై గొప్ప ఆఫర్
సేల్ సమయంలో రియల్ మీ పాడ్ మినీని రూ. 8,999కి, రియల్‌మి ప్యాడ్ స్లిమ్‌ని రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ బుక్ స్లిమ్ కోర్ i5పై రూ. 12,000 వరకు, కోర్ i3 వేరియంట్‌పై రూ. 9,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. రియల్ మీ బుక్ స్లిమ్ i3ని రూ. 37,999కి కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ల్యాప్‌టాప్ కోర్ i5 వేరియంట్ ధర రూ. 47,999కి లభిస్తుంది.

click me!