రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ భారత్‌లో లాంచ్ అయింది. రియల్‌మీ జీటీ 2 ప్రో లాంచ్ ఈవెంట్‌లోనే ఈ ల్యాప్‌టాప్‌ను రియల్‌మీ విడుదల చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో ఆవిష్కరించిన ఈ ల్యాప్‌టాప్‌ను ఇప్పుడు ఇండియాకు తీసుకొచ్చింది. 2K ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో Realme Book Prime వస్తోంది.
రియల్‌మీ మనదేశంలో తన కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ బుక్ ప్రైమ్. ఇందులో 14 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్ ఫ్యాన్ లిక్విడ్ కూలింగ్ సిస్టంను కూడా ఇందులో అందించినట్లు కంపెనీ తెలిపింది. దీనిపై పలు బ్యాంకు ఆఫర్లను కూడా కంపెనీ అందించింది.
రియల్‌మీ బుక్ ప్రైమ్ ధర
ఇందులో కేవలం ఒక్క మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ మోడల్ ధర రూ.64,999గా ఉంది. రియల్ బ్లూ, రియల్ గ్రీన్, రియల్ గ్రే రంగుల్లో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 13వ తేదీన దీని సేల్ జరగనుంది. ప్రారంభ సేల్ కింద ఈ ల్యాప్‌టాప్‌ను రూ.57,999కే విక్రయించనున్నారు. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.3,000 తగ్గింపు లభించనుంది. అంటే రూ.54,999కే కొనుగోలు చేయవచ్చన్న మాట. అయితే ఈ ఆఫర్ ఎంత వరకు ఉండనుందో తెలియరాలేదు.
రియల్‌మీ బుక్ ప్రైమ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 2కే ఫుల్ విజన్ డిస్‌ప్లేను అందించారు. 11వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. డ్యూయల్ ఫ్యాన్ లిక్విడ్ కూలింగ్ సిస్టంను కూడా ఇందులో అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో బ్యాక్‌లిట్ కీబోర్డు, టచ్‌ప్యాడ్‌ను అందించారు. డీటీఎస్ ఆడియో టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. వైఫై 6, థండర్‌బోల్ట్ 4 పోర్టు ఇందులో ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటల బ్యాకప్‌ను దీని బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేయవచ్చు.