BEST SMART TVS FOR BINGE: ఓటీటీలు ఎక్కువ స్ట్రీమ్ చేస్తున్నారా.. అయితే వాటికి బెస్ట్ టీవీలు ఇవే..!

By team telugu  |  First Published Apr 10, 2022, 11:48 AM IST

భారతదేశంలో సాధారణ టీవీల కంటే స్మార్ట్ టీవీలకు (Smart Tv) ఫుల్ డిమాండ్ ఉంటుంది. బడ్జెట్ (Budget) ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బడ్జెట్​ స్మార్ట్​టీవీల్లో ఛానెళ్లతో పాటు ఓటీటీ కంటెంట్​ను కూడా యాక్సెస్​ చేయవచ్చు.
 


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల టైమ్ నడుస్తోంది. మనదేశంలో కూడా వీటికి సబ్‌స్క్రైబర్లు భారీగా ఎక్కువయ్యారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5 వంటి యాప్స్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నారు. కొంతమంది యువత స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసి డిష్, డీటీహెచ్ పెట్టించుకోకుండా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫాంలనే సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా ఓటీటీల్లో కంటెంట్ చూడటానికి మంచి స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నట్లయితే మీకు టాప్-5 ఆప్షన్లు ఇవే..!

ఎల్జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ

Latest Videos

ఈ లిస్ట్‌లో మొదటి స్మార్ట్ టీవీ 32 ఇంచుల ఎల్జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి. ఇందులో 50 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ ఇమేజ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 10W డాల్బీ ఆడియో సపోర్ట్‌ను ఇందులో అందించారు. ఈ టీవీ అసలు ధర రూ.23,990 కాగా... అమెజాన్‌లో రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు.

ఎంఐ హారిజన్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ

ఈ 40 అంగుళాల స్మార్ట్ టీవీ వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉండనుంది. 20W స్టీరియో స్పీకర్లను కూడా ఇందులో అందించారు. సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందించనుంది. ఆండ్రాయిడ్ 9 టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ఈ టీవీ అసలు ధర రూ.29,999 కాగా... అమెజాన్‌లో రూ.24,999కే అందుబాటులో ఉంది.

రెడ్‌మీ 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

ఈ టీవీలో 50 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 4కే హెచ్‌డీఆర్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని విజువల్ క్లారిటీ చాలా గొప్పగా ఉండనుంది. 30W స్పీకర్లను ఇందులో కంపెనీ అందించింది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. దీని అసలు ధర రూ.44,999 కాగా... అమెజాన్‌లో రూ.35,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ వండర్‌టెయిన్‌మెంట్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ

ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 20W డాల్బీ ఆడియోను కూడా ఇందులో అందించారు. ఈ టీవీలో పర్సనల్ కంప్యూటర్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా ఈ టీవీని పీసీలా కూడా వాడుకోవచ్చు.

వూ 4కే సిరీస్ స్మార్ట్ ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ

వూ 43 అంగుళాల స్మార్ట్ టీవీ 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో రానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 30W డాల్బీ ఆడియో సపోర్ట్‌ను ఇందులో అందించారు. ఈ టీవీ రూ.27,999 ధరకే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

click me!