Realme book prime:నేడే రియల్ మీ బుక్ ప్రైమ్ అండ్ ఏయిర్ 3 బడ్స్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్ కింద తక్కువ ధరకే..

Ashok Kumar   | Asianet News
Published : Apr 13, 2022, 12:11 PM ISTUpdated : Apr 13, 2022, 12:12 PM IST
Realme book prime:నేడే రియల్ మీ బుక్ ప్రైమ్  అండ్  ఏయిర్ 3 బడ్స్  ఫస్ట్ సేల్..  లాంచ్ ఆఫర్ కింద తక్కువ ధరకే..

సారాంశం

రియల్ మీ బుక్ ప్రైమ్  16జి‌బి  ర్యామ్ తో 512జి‌బి స్టోరేజ్ ధర రూ.64,999. రియల్ బ్లూ, రియల్ గ్రీన్ అండ్ రియల్ గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు.  

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ కొద్దిరోజుల క్రితం రియల్ మీ బుక్ ప్రైమ్ ని ఆవిష్కరించింది. అయితే నేడు రియల్ మీ బుక్ ప్రైమ్  అండ్ రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 ఫస్ట్ సేల్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. Intel Iris Xe గ్రాఫిక్స్ 11వ Gen Intel Core i5-11320H ప్రాసెసర్‌ రియల్ మీ బుక్ ప్రైమ్ లో అందించారు. Realme Buds Air 3లో 10mm డైనమిక్ డ్రైవర్ ఉంది, దానితో బేస్ బూస్ట్ క్లెయిమ్ చేయబడింది. కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ v5.2 ఇందులో ఇచ్చారు. దీనిలో బెస్ట్  ఏమిటంటే మీరు ఏకకాలంలో రెండు డివైజెస్ కనెక్ట్ చేయవచ్చు.

Realme Book Prime అండ్ Realme Buds Air 3 ధర
Realme Book Prime 16జి‌బి  ర్యామ్ తో 512జి‌బి స్టోరేజ్ ధర రూ.64,999. దీనిని రియల్ బ్లూ, రియల్ గ్రీన్ అండ్ రియల్ గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఇంకా రిటైల్ స్టోర్‌లలో ఈరోజు మధ్యాహ్నం నుండి సేల్స్  ఉంటాయి. లాంచింగ్ ఆఫర్ కింద ల్యాప్‌టాప్‌ను రూ. 57,999కి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు రూ. 3,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. Realme Buds Air 3 ధర రూ. 3,999. వీటిని గెలాక్సీ వైట్ అండ్ స్టార్రీ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Realme Book Prime స్పెసిఫికేషన్‌లు
Realme Book Primeలో 2K ఫుల్ విజన్ డిస్‌ప్లే ఉంది. గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ ఐరిస్ Xeతో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-11320H ప్రాసెసర్‌తో వస్తుంది. గరిష్టంగా 16జి‌బి ర్యామ్, 512జి‌బి వరకు ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఇచ్చారు. ల్యాప్‌టాప్ డ్యూయల్ ఫ్యాన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం బ్యాక్‌లిట్ కీబోర్డ్ అండ్ టచ్‌ప్యాడ్‌ను కూడా ఉంది. ఇంకా స్టీరియో స్పీకర్‌ లభిస్తుంది. దానితో DTS ఆడియోకు సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌ ఉంది. ల్యాప్‌టాప్ బ్యాటరీకి సంబంధించి 12 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. ఇంకా 65W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ టైప్-సి పోర్ట్‌ను ఉంది.

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3
Realme Buds Air 3 TWS 10mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్‌ ప్యాక్ తో వస్తుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇంకా ఈ బడ్స్ TUV-రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ పొందింది, అలాగే 42dB నాయిస్‌ను క్యాన్సెల్ చేస్తుందని పేర్కొంది.  ట్రాన్స్పరెంట్ మోడ్‌తో పాటు రెండు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. లేటెన్సీ మోడ్, గేమ్ మోడ్ కూడా ఉంది.

కనెక్టివిటీ కోసం Realme Buds Air 3లో బ్లూటూత్ v5.2 ఇచ్చారు. మీరు ఏకకాలంలో రెండు డివైజెస్ కనెక్ట్ చేయవచ్చు.  ఈ బడ్స్ Google ఫాస్ట్ పెయిర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.  వాటర్ రిసిస్టంట్ కోసం IPX5 రేటింగ్‌ను పొందింది. బ్యాటరీకి సంబంధించి 30 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేశారు. ఇందులో ఛార్జింగ్ కేస్ బ్యాకప్ కూడా ఉంటుంది.  ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడ ఉంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 100 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను క్లెయిమ్ చేస్తుంది. కేసుతో సహా మొత్తం బడ్స్ బరువు 37 గ్రాములు, ప్రతి బడ్స్ 4.2 గ్రాముల బరువు ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?