Moto G22: నేడే బడ్జెట్ ఫోన్ మోటో జీ22 సేల్.. ధ‌ర కూడా త‌క్కువే..!

By team telugu  |  First Published Apr 13, 2022, 11:46 AM IST

భారత మార్కెట్‌లో మరో బడ్జెట్ మొబైల్‌ను మోటోరోలా లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో కొత్తగా మోటో జీ22 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన నాలుగు వెనుక కెమెరాలు, 90Hz డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ వస్తోంది.
 


మోటో జీ22 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈనెల‌లోనే లాంచ్ అయింది. ఈ ఫోన్ యూరోప్‌లో గత నెలలోనే లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే అందించారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. రెడ్‌మీ 10, ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్, రియల్‌మీ సీ25వై, శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్లతో మోటో జీ22 పోటీ పడనుంది.

మోటో జీ22 ధర

Latest Videos

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. బుధ‌వారం (ఏప్రిల్ 13) మ‌ధ్యాహ్నం 12 నుంచి Motorola India online storeల‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ జరగనుంది. కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ, మింట్ గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నేడు (బుధ‌వారం), రేపు (గురువారం) ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లభించనుంది.

మోటో జీ22 స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్‌విజన్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను మోటో జీ22లో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా... 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. మోటో జీ22లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా.. బరువు 185 గ్రాములుగా ఉంది.

click me!