వన్ ప్లస్ కొత్త ఎడిషన్ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే కెమెరా, బెస్ట్ ఫీచర్స్ ఇవే..

By asianet news teluguFirst Published Sep 20, 2022, 2:11 PM IST
Highlights

స్టాండర్డ్ ఎడిషన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. వన్ ప్లస్  10ఆర్ 5జి డైమెన్సిటీ 8100-మాక్స్ ప్రాసెసర్‌తో 6.7-అంగుళాల పూర్తి హెచ్‌డి+ ఆమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో  అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంటుంది.
 

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్  10ఆర్ 5జిని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత కంపెనీ  వన్ ప్లస్  10ఆర్ 5జి ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ను  సెప్టెంబర్ 22న లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  వన్ ప్లస్  10ఆర్ 5జి ఎండ్యూరెన్స్ ఎడిషన్ 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పరిచయం చేసారు.

స్టాండర్డ్ ఎడిషన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. వన్ ప్లస్  10ఆర్ 5జి డైమెన్సిటీ 8100-మాక్స్ ప్రాసెసర్‌తో 6.7-అంగుళాల పూర్తి హెచ్‌డి+ ఆమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో  అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంటుంది.

అంతేకాకుండా ఈ వేరియంట్‌ను వన్ ప్లస్ వెబ్‌సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. కొత్త ఎడిషన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వన్ ప్లస్  10ఆర్ 5జిని రూ. 38,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.

స్పెసిఫికేషన్‌లు
కొత్త ఎడిషన్‌తో ఫీచర్‌లకు సంబంధించి ఎటువంటి మార్పు కనిపించదు. వన్ ప్లస్  10ఆర్ 5జి 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, డిస్ ప్లేపై గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,  ఫోన్‌లో MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌తో 3D పాసివ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. వన్ ప్లస్ 10R 5జిలో 5000mAh బ్యాటరీ లభిస్తుంది.

click me!