వచ్చే నెలలో పోకో ఎక్స్4 ప్రొ 5జి లాంచ్.. 64ఎం‌పి కెమెరాతో 11 జీబీ ర్యామ్..

Ashok Kumar   | Asianet News
Published : Mar 22, 2022, 01:57 PM IST
వచ్చే నెలలో పోకో ఎక్స్4 ప్రొ 5జి లాంచ్.. 64ఎం‌పి కెమెరాతో 11 జీబీ ర్యామ్..

సారాంశం

పోకో ఇండియా Poco X4 Pro 5G టీజర్‌ను కూడా విడుదల చేసింది, దీనిలో X అని వ్రాసి ఉంది. ఫోన్ లాంచ్ ఏప్రిల్ 10న జరుగుతుందని ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది, అయితే పోకో ఇండియా దీని గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు.

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో (poco) ఇండియాలో కొత్త ఫోన్  పోకో ఎక్స్4 ప్రొ 5జి(Poco X4 Pro 5G)లాంచ్ తేదీ ప్రకటించింది. Poco X4 Pro 5Gని మొదట ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2022లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. Poco X4 Pro 5G భారతీయ వేరియంట్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. Poco X4 Pro 5G  గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జి‌బి వరకు ర్యామ్ తో పరిచయం చేశారు.

పోకో ఇండియా Poco X4 Pro 5G టీజర్‌ను కూడా విడుదల చేసింది, దీనిలో X అని వ్రాసి ఉంది. ఫోన్ లాంచ్ ఏప్రిల్ 10న జరుగుతుందని ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది, అయితే పోకో ఇండియా దీని గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు.

పోకో X4 Pro 5G గ్లోబల్ వేరియంట్ ధర
పోకో X4 Pro 5జి  6జి‌బి ర్యామ్‌, 128జి‌బి స్టోరేజ్ ధర 299 యూరోలు అంటే దాదాపు రూ. 25,300. 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ధర 349 యూరోలు అంటే దాదాపు రూ. 29,500. ఫోన్‌ను లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ, పోకో ఎల్లో కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. 
 
Poco X4 Pro 5G గ్లోబల్ వేరియంట్ ఫీచర్స్ 
ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13 Poco X4 Pro 5Gలో అందించారు. అంతేకాకుండా 6.67-అంగుళాల హెచ్‌డి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే, 1200 నిట్‌ల బ్రైట్‌నెస్, డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz, Snapdragon 695 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ అందుబాటులో ఉంది, దీని సహాయంతో ర్యామ్‌ను 11 జీబీకి పెంచుకోవచ్చు.

పోకో X4 Pro 5G గ్లోబల్ వేరియంట్ కెమెరా
ఈ పోకో ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f/1.9 మరోవైపు, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో, ముందు భాగంలో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

Poco X4 Pro 5G గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ
ఈ పోకో ఫోన్‌లో Wi-Fi, బ్లూటూత్, NFC, కనెక్టివిటీ కోసం IR బ్లాస్టర్ ఉన్నాయి. ఇంకా 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 205 గ్రాములు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!