Asus ZenBook 14 Flip: ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లేతో లాంచ్.. ఈ ల్యాప్‌టాప్ ని 360 డిగ్రీలు తిప్పవచ్చు..

By asianet news telugu  |  First Published Mar 21, 2022, 6:47 PM IST

ల్యాప్‌టాప్ టాప్ మోడల్ అంటే 16జి‌బి ర్యామ్, 1టి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్‌తో AMD Ryzen 9 5900HX ప్రాసెసర్ ధర రూ. 1,34,990. ఈ ల్యాప్‌టాప్‌తో ఒక సంవత్సరం అంతర్జాతీయ వారంటీ కూడా లభిస్తుంది.
 


తైవాన్ మల్టీనేషనల్ కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ (asus)ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ భారతదేశంలో  ఆసుస్  జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డి  (Asus ZenBook 14 Flip OLED)ని విడుదల చేసింది.  జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డితో డిజైన్ కన్వర్టిబుల్ అండ్ 2.8K OLED డిస్ ప్లే అందించారు.  ఆసుస్  జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డి ప్రపంచంలోనే అత్యంత పలుచని 14-అంగుళాల కన్వర్టిబుల్ OLED డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌గా పేర్కొనబడింది. జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డి  360 డిగ్రీల వరకు తిప్పవచ్చు. స్పాష్టంగా చెప్పాలంటే, మీరు జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డిని ల్యాప్‌టాప్ ఇంకా టాబ్లెట్ పద్ధతిలో ఉపయోగించవచ్చు.

జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓ‌ఎల్‌ఈ‌డి  ధర
AMD Ryzen 5 5600H ప్రాసెసర్, 16జి‌బి ర్యామ్, 512జి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్‌తో దీని ధర రూ. 91,990, అయితే ZenBook 14 Flip OLED AMD Ryzen 7 5800H ధర రూ. 1,12,990, 16 జి‌బి ర్యామ్ 1టి‌బి  స్టోరేజ్ లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ టాప్ మోడల్ అంటే AMD Ryzen 9 5900HX ప్రాసెసర్ 16 జి‌బి ర్యామ్, 1 టి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ధర రూ. 1,34,990. ల్యాప్‌టాప్‌తో ఒక సంవత్సరం అంతర్జాతీయ వారంటీ లభిస్తుంది. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆసుస్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయించనుంది.

Latest Videos

 స్పెసిఫికేషన్స్
Windows 11 Asus ZenBook 14 Flip OLEDలో ఇచ్చారు. దీనికి 14-అంగుళాల 2.8K 10-బిట్ OLED నానోఎడ్జ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో  టచ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 16:10, బ్రైట్‌నెస్ 550 నిట్స్. ZenBook 14 Flip OLED AMD Ryzen 9 5900H ప్రాసెసర్, 16GB LPDDR4X RAM, 1TB వరకు M.2 NVMe PCIe Gen 3 SSD స్టోరేజ్ ద్వారా శక్తిని పొందుతుంది.

కనెక్టివిటీ కోసం, ఈ అసుస్ ల్యాప్‌టాప్‌లో Dual Band Wi-Fi 6, బ్లూటూత్ v5.0, రెండు USB 3.2 Gen 2 Type-C పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 2 Type-A పోర్ట్, HDMI 2.0, మైక్రో ఎస్‌డి కార్డ్ రీడర్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. 

Asus ZenBook 14 Flip OLED ఎలక్ట్రానిక్ ప్రైవసీ షట్టర్‌తో హెచ్‌డి వెబ్‌క్యామ్‌తో వస్తుంది. దానితో పాటు బ్యాక్‌లైట్ కీబోర్డ్ కూడా ఉంది. దీనితో పాటు, Magic NumberPad 2.0 ట్రాక్‌ప్యాడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ZenBook 14 Flip OLED హర్మాన్-కార్డాన్ స్పీకర్‌ను ఉంది. నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ల్యాప్‌టాప్‌తో 100W టైప్-సి ఛార్జింగ్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 63Wh బ్యాటరీ ఉంది.

click me!