పెరుగుతున్న వాట్సాప్ పింక్ మోసాలు.. క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్ హ్యాక్..

By asianet news telugu  |  First Published Jun 30, 2023, 3:17 AM IST

సోషల్ మీడియాలో మీరు చేసే ఒక్క పొరపాటు మీ మొత్తం డేటాను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి వాట్సాప్ పింక్ ఉపయోగించవద్దని ముంబై పోలీసులు ప్రజలకు సూచించారు.
 


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు వాట్సాప్ పింక్ అనే కొత్త స్కామ్ గురించి ముంబై పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముంబై పోలీసులు ఇచ్చిన సలహా ప్రకారం.. 'న్యూ పింక్ లుక్ వాట్సాప్' ఎక్స్‌ట్రా ఫీచర్‌తో అనే మెసేజ్ తో  ప్రముఖ మెసేజింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా మొబైల్‌ను హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు. నివేదిక ప్రకారం, "సైబర్ మోసాలకు పాల్పడేందుకు మోసగాళ్లు  వినియోగదారులను  ఆకర్షించడానికి వివిధ కొత్త ఉపాయాలు, పద్ధతులతో వస్తున్నారు. వినియోగదారులు అలాంటి మోసాల గురించి తెలుసుకోవాలి ఇంకా  అప్రమత్తంగా ఉండాలి అలాగే డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండాలి.

వాట్సాప్ పింక్ అంటే ఏమిటి 
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకి తెలియని నంబర్ నుండి ఫెక్  లింక్‌ వస్తుంది. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ మీ మొబైల్‌లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేయబడుతుంది. ఈ వైరస్ యూజర్ల ఫోన్‌కు సోకుతుంది ఇంకా వాట్సాప్‌లోని ఇతర మీ  కాంటాక్ట్ వ్యక్తుల మొబైల్‌లకు కూడా వైరస్ వెళ్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ మొబైల్ వినియోగదారుకు తెలియకుండానే మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. నకిలీ వాట్సాప్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసే వినియోగదారులు వారి మొబైల్‌పై కంట్రోల్ కోల్పోతారు. చివరకు వారి మొబైల్ పూర్తిగా హ్యాక్ అవుతుంది. ఫోటో, OTP, కాంటాక్ట్ నంబర్  కొన్ని ఇతర అవసరమైన డాకుమెంట్స్  వంటి ముఖ్యమైన వ్యక్తిగత డేటాను కోల్పోతారు.

Latest Videos

undefined

మొబైల్‌లోని కాంటాక్ట్ నంబర్లు, ఫోటోలను దుర్వినియోగం చేయడం, మీ అకౌంట్లో డబ్బు  ఖాళీ అవడ , వ్యక్తిగత రికార్డులను దుర్వినియోగం చేయడం, స్పామ్ ఇంకా మొబైల్‌పై కంట్రోల్ కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొవచ్చు.

ముంబై పోలీసుల హెచ్చరిక:మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసిన నకిలీ యాప్‌లను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయమని ముంబై పోలీసులు సలహా ఇస్తున్నారు. ఏదైనా లింకులు లేదా మెసేజులు  ఫార్వార్డ్ చేయవద్దు.  మీ వ్యక్తిగత వివరాలు లేదా లాగిన్ ఆధారాలు/పాస్‌వర్డ్‌లు/క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సమాచారం వంటి ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు. 

click me!