మహిళలకు వాట్సాప్ ఆఫర్.. ప్రైవేట్ ఫీచర్లపై అవగాహన కోసం నటితో ఒప్పందాలు!

By asianet news teluguFirst Published Jun 29, 2023, 4:18 PM IST
Highlights

మహిళలకు ప్రైవేట్ ఫీచర్లపై అవగాహన కల్పించేందుకు వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ఇప్పుడు మహిళల భద్రత, గోప్యత ఇంకా  ప్రైవేట్ సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి నటి అనుష్క శర్మతో భాగస్వామ్యం  చేసుకుంది. 
 

న్యూఢిల్లీ: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవల పదికి పైగా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వినియోగదారుల డిమాండ్ ఇంకా సౌలభ్యం ప్రకారం ఈ లేటెస్ట్ ఫీచర్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పుడు వాట్సాప్ మహిళల కోసం ప్రత్యేక ఫీచర్  అందిస్తోంది. ఇది మహిళల ప్రైవసీ  ఫీచర్స్  గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడింది. ఇందుకోసం ప్రత్యేక క్యాంపైన్ ప్రారంభించారు. వాట్సాప్ ఇప్పుడు ఈ క్యాంపైన్ మరింత సమర్థవంతంగా అందించడానికి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో టై అప్ అయ్యింది.

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో, మాల్స్, ప్రైవేట్ స్థలాలు,  విశ్రాంతి గదులు సహా అనేక ప్రదేశాలలో ఉమెన్స్ ప్రైవసీ  మెసేజ్  అద్దాలపై ప్రదర్శించబడుతుంది. ఇది కాకుండా QR కోడ్ కూడా అందించబడుతుంది. ఈ కోడ్‌ని స్కాన్ చేస్తే ఉమెన్స్ ప్రైవసీ సమాచారం గురించిన వివరాలు అందుబాటులో ఉంటాయి.  

వాట్సాప్ మహిళల సన్నిహిత సంప్రదింపులు, రహస్య సమస్యలు, సేఫ్టీ వంటి అనేక సమాచారంపై అవగాహన కల్పిస్తుంది. వాట్సాప్ వినియోగదారుల రహస్య సమాచారాన్ని మినిమైజ్ చేయడానికి అనుమతిస్తుంది. మహిళల గోప్యతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. వాట్సాప్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ మాట్లాడుతూ మహిళలు వారి వ్యక్తిగత ఆలోచనలను పంచుకోవడానికి, షేర్ చేయడానికి  వాట్సాప్ దోహదపడుతుందని అన్నారు.

నేను WhatsAppతో భాగస్వామ్యం చేసాను. మహిళలకు వారి వ్యక్తిగత సమస్యలపై అవగాహన కల్పించేందుకు నేను కట్టుబడి ఉన్నాను. వాట్సాప్ మహిళల భద్రత, వారి శ్రేయస్సు, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం, ప్రైవేట్ సంభాషణలు, స్నేహితులు, సహోద్యోగులు, ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడే అవకాశం కల్పిస్తుందని నటి అనుష్క శర్మ అన్నారు. 

వాట్సాప్ ఇంతకుముందు  పదికి పైగా ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఆన్ లోన్ కాల్‌లను మ్యూట్ చేయడానికి ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. తెలియని ఇంకా స్పామ్ కాల్‌ల చికాకు నుండి వినియోగదారులను రక్షించడానికి సేవ్ చేయని నంబర్‌ల నుండి ఫోన్ కాల్‌లను ఆటోమేటిక్ గా మ్యూట్ చేసే కొత్త ఫీచర్‌ను WhatsApp ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో సైలెంట్ అన్‌నోన్ నంబర్స్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. దింతో తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్‌లను వాట్సాప్ మ్యూట్  చేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ను Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు.  ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

click me!