ఎల్‌జి తరువాత ఇప్పుడు రెండు డిస్ ప్లేలతో షియోమీ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని ఇండియా లో తీసురానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అధికారికంగా దృవీకరించింది.
చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమి తాజాగా చైనాలో ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసింది. అయితే భారత మార్కెట్లో ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ పై ప్రకటించింది. ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా లాంచ్ ఏప్రిల్ 23న జరగనుంది.
షియోమి ఇండియా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎంఐ 11 అల్ట్రాలో 120 ఎక్స్ జూమ్, రెండు డిస్ ప్లేలతో వస్తుంది. అంతేకాకుండా దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించారు.
undefined
ఎంఐ 11 అల్ట్రా ధర
8 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ధర 5,999 చైనీస్ యువాన్, అంటే సుమారు 66,400 రూపాయలు. 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 6,499 చైనీస్ యువాన్ అంటే 72,000 రూపాయలు. 12 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్ ధర 6,999 యువాన్లు, అంటే సుమారు 77,500 రూపాయలు.
ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఎంఐ 11 అల్ట్రాలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12, 6.81-అంగుళాల క్వాడ్-కర్వ్ 2కే WQHD + E-4 AMOLED డిస్ ప్లే ది, ఇది 3200 × 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. డిస్ ప్లేకి HDR10 + అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 1.1-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే కూడా ఉంది. ఆల్వేస్ ఆన్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 660 జిపియు, 12 జిబి వరకు ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్, 512 జిబి వరకు స్టోరేజ్ ఉన్నాయి.
Surreal, the way it looks!
Thrilling to be around!
👉 The Only
Launching on 23rd April.
Know more: https://t.co/nZvuM8atx1 pic.twitter.com/7sAeCvRJOL
ఎంఐ 11 అల్ట్రా కెమెరా
ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జిఎన్ 2 సెన్సార్. ఈ లెన్స్ వైడ్ యాంగిల్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండవ లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 అల్ట్రా వైడ్ లెన్స్. మూడవ లెన్స్ 5 x ఆప్టికల్ అండ్ 120 x డిజిటల్ జూమ్, సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఎంఐ 11 అల్ట్రా బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ లో 5జి, 4 జి విఓఎల్‌టిఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు హర్మాన్ కార్డాన్ స్టీరియో స్పీకర్, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. దీని బరువు 225 గ్రాములు. 67W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నీరు ఇంకా డస్ట్ ప్రూఫ్ కోసం IP68 రేటింగ్ కూడా పొందింది.